సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 00:22:22

నేడు బస్తీ దవాఖానలు ప్రారంభం

 నేడు బస్తీ దవాఖానలు ప్రారంభం

 దుండిగల్‌, ఆగస్టు13: పేదప్రజలు, సామాన్యులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో శుక్రవారం మరో రెండు బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నాయి. గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని సూరారం శ్రీకృష్ణానగర్‌తో పాటు గాజులరామారం గ్రామంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ,టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించనున్నారు. 


logo