శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:39:38

లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై దాడి

లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై దాడి

బండ్లగూడ : ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై.. ఆమె సోదరులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. వట్టేపల్లిలో ఓ మహిళ నివాసం ఉంటుంది. అల్లుడు వరుస అయిన సోహెల్‌.. ఎలక్ట్రిషియన్‌ పనులు చేసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. వెంటనే ఆమె.. జరిగిన విషయాన్ని సోదరులకు తెలిపింది. వారు మాట్లాడుకుందాం అని సోహెల్‌ను పిలిచి.. అతడిపై కత్తులతో దాడిచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.