శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 01:01:14

కల్యాణలక్ష్మితో పేదింటి తల్లిదండ్రులకు భరోసా

కల్యాణలక్ష్మితో పేదింటి తల్లిదండ్రులకు భరోసా

దోమ: కల్యాణలక్ష్మి పథకం పేదింటి తల్లిదండ్రులకు తమ ఆడ బిడ్డల పెళ్లిల్లు చేస్తామనే భరోసాను కల్పించిందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.మంగళవారం దోమ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ అనసూయతో కలిసి పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధ్దిదారులకు గాను 29,03364/రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం అమలులోకి తీసుకురావడంతో పేదింటి తల్లిదండ్రుల్లో తమ ఆడ బిడ్డల పెళ్లిల్లు చేస్తామనే భరోసా కలిగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసి నాగిరెడ్డి , వైస్‌ ఎంపీపి మల్లేశం, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు హన్మంతునాయక్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, మండల రైతు బంధు కోఆర్డినేటర్‌ లక్ష్మయ్యముదిరాజ్‌, జిల్లా గ్రంథాలయ డైరక్టర్‌ యాదయ్యగౌడ్‌, కోఆప్షన్‌ ఖాజాపాష, ఎంపీటీసీ అనిత, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రాజగోపాలచారి, రాఘవేందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కల్యాణలక్ష్మి లబ్ధ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

రహదారి నిర్మిచాలని ఎమ్మెల్యేకు వినతి

పరిగి : పూడూరు మండల పరిధిలోని మిట్టకంకల్‌ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డికి గ్రామ సర్పంచ్‌ శ్యామ్‌కుమార్‌, జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భేరి రాంచందర్‌యాదవ్‌లు మంగళవారం పరిగిలో వినతిపత్రం అందజేశారు. గ్రామానికి రహదారి లేదని, కొద్దిపాటి వర్షం కురిసినా గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఎమ్మెల్యేకు తెలిపారు. కూరగాయలు తరలించడానికి సైతం ఇబ్బందిగా మారడంతో మూడు కిలోమీటర్ల దూరం ఎడ్లబండ్లపై కూరగాయలు తరలిస్తున్నారన్నారు. అందువల్ల గ్రామానికి రహదారి నిర్మాణం చేయించాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ప్రత్యేక నిధులు కేటాయించి మిట్టకంకల్‌ను అభివృద్దిపథంలో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మాణిక్యం, దేవయ్య, రాజు, యువజన నాయకులు ఆంజనేయులు, కుమార్‌, మహేందర్‌  పాల్గొన్నారు.