ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Sep 30, 2020 , 07:07:33

బురాన్‌ఖాన్‌ చెరువును పరిశీలించిన అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎమ్మెల్యే పాషాఖాద్రి

బురాన్‌ఖాన్‌ చెరువును పరిశీలించిన అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎమ్మెల్యే పాషాఖాద్రి

ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలను తొలగిస్తాం 

బడంగ్‌పేట/పహాడీషరీఫ్‌, సెప్టెంబర్‌ 29: ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నా రు. బడంగ్‌పేట పురపాలక పరిధిలోని బురాన్‌ఖాన్‌ చెరువును యాకుత్‌పుర ఎమ్మెల్యే పాషాఖాద్రి, కందుకూరు ఆర్డీవో రవీందర్‌రెడ్డి, బాలాపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముంపునకు గురైన ఉస్మాన్‌నగర్‌, అమ్రీన్‌కాలనీలో పర్యటించారు. ప్రజా సమస్యలతో పాటు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన కట్టడాలపై చైర్మన్‌, తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చైర్మన్‌ అబ్దుల్లా సాది, కమిషనర్‌ జి.పి.కుమార్‌, కౌన్సిలర్‌ జాఫర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యూసుఫ్‌ పటేల్‌, ఇక్బాల్‌ బిన్‌ ఖలీఫా, ఎంఐఎం నాయకులు హైమద్‌సాది, సయ్యద్‌ యాహియా, హసన్‌, అహ్మద్‌ అజీజ్‌ పాల్గొన్నారు.

కొలతలను త్వరగా పూర్తి చేయాలి

కందుకూరు: గ్రామాల్లో ఇండ్ల కొలతలను త్వరగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని బైరాగిగూడలో జరుగుతున్న కొలతల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ రహమాన్‌, కార్యదర్శి ఈశ్వరి పాల్గొన్నారు.