ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 14, 2020 , 02:09:52

వేగంగా దూసుకొచ్చి.. ఢీకొట్టి.. దంపతులకు గాయాలు

వేగంగా దూసుకొచ్చి.. ఢీకొట్టి.. దంపతులకు గాయాలు

శామీర్‌పేట: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగానికి ఓ మహిళ బలైంది. దంపతులు బైక్‌పై వెళుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శ నివారం చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... శామీర్‌పేటకు చెందిన వాసలమర్రి రమేశ్‌.. భార్య జ్యోతి(43)తో కలిసి బైక్‌పై ఇంటి నుంచి  తూంకుంటకు బయలుదేరారు. మార్గమధ్యలో అతివేగంగా దూసుకొచ్చిన కారు (ఏపీ13ఎం8572) బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచా రం అందుకున్న పోలీసులు గాయపడిన రమేశ్‌ను దవాఖానకు తరలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.