గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:27:13

టీఆర్‌ఎస్‌తోనే ఉజ్వల భవిష్యత్‌

టీఆర్‌ఎస్‌తోనే ఉజ్వల భవిష్యత్‌

 ఉప్పల్‌ : యువత పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిలుకానగర్‌ డివిజన్‌కు చెందిన జీఎంఆర్‌ ట్రస్టు చైర్మన్‌ గుడి మధుసూదన్‌రెడ్డి శనివారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు మధుసూదన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి చాలమంది నేతలు, ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, మేకల మధుసూదర్‌రెడ్డి, అరిటికాయల భాస్కర్‌, ఉప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, రవీందర్‌, జగదీశ్‌, పల్లె నర్సింగ్‌రావు, మోహన్‌రెడ్డి, వెంకటేశ్‌ పాల్గొన్నారు.