శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Jun 14, 2020 , 04:13:13

పేదలకు వరం కల్యాణలక్ష్మి

పేదలకు వరం కల్యాణలక్ష్మి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

64 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత

బడంగ్‌పేట:  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌  పథకాలు పేదలకు వరమని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్‌చౌరస్తాలోని ఆనంద్‌ఫంక్షన్‌ హాల్‌లో 64 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాపూర్‌ మండల పరిధిలోని  జనవరి నుంచి జూన్‌ వరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా 940 మంది లబ్ధిదారులకు రూ 9.45 కోట్లు  అందజేశామన్నారు. అదేవిధంగా తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా  12 కిలోల బియ్యం, మూడు వేలు ఇచ్చామని పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు  ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యాతం పవన్‌, సూర్ణ గంటి అర్జున్‌, శ్రీనివాస్‌రెడ్డి, రా మిడి రాంరెడ్డి, శివకుమార్‌, జనిగ భారతమ్మ, అనిల్‌ కమార్‌, లావణ్య బీరప్ప, మాధవి సాయినాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

కందుకూరు:  లేమూరు గ్రామానికి చెందిన రిజ్వానా బేగం కూతురు వివాహానికి కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్షా 116 వేల చెక్కును ఎంపీటీసీల ఫోరం మండల  మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్‌రెడ్డి  అందజేశారు. సర్పంచ్‌లు పరంజ్యోతి, రాము, ఉప సర్పంచ్‌ కొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక మేఘనాథ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి..

పహాడీషరీఫ్‌: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి ఎర్రకుంటలోని ఎన్‌జేఆర్‌ గార్డెన్‌లో మారి స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మురళి, ప్రోగ్రాం డైరెక్టర్‌  జయరామారావు ఆధ్వర్యంలో 500 మంది పేదలకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, సరుకులను పంపిణీ చేశారు.   కౌన్సిలర్లు శంషొద్దీన్‌, మజర్‌అలీ, దిల్‌రుసా అ జీజ్‌ ఫరహీన్‌,  నాయకులు  హుస్సేన్‌, ఇక్బాల్‌ బిన్‌ ఖలీ ఫా, ఖైసర్‌బామ్‌, అఫ్జల్‌, నిమ్మల నరేందర్‌గౌడ్‌, మన్నన్‌, హసన్‌షా, ఫిరోజ్‌, హుస్సేన్‌, మారి సంస్థ సభ్యులు రమాజ్యోతి, డేవిడ్‌, వెంకన్న, అమ్రపాల్‌, శ్రీదేవి, జగన్‌, రాజు, బాలాపూర్‌ సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వినయ్‌ పాల్గొన్నారు.