మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 00:14:14

వృత్తి విద్యా కోర్సులతో మంచి భవిష్యత్‌

వృత్తి విద్యా కోర్సులతో మంచి భవిష్యత్‌

ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా పాలిటెక్నిక్‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

బడంగ్‌పేట, ఆగస్టు 10: వృత్తి విద్యా కోర్సులతో మంచి భవిష్యత్‌ ఉంటుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్ష రాయనున్న విద్యార్థులకు ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్‌ మోడల్‌ పేపర్లు ప్రశ్నపత్రాలతో కూడిన పుస్తకాలను మంత్రి అందజేశారు. బషీర్‌బాగ్‌లోని మంత్రి కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి చిత్రారాంచంద్రన్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఓమర్‌ జలీల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రొ.లింబాద్రి, పాఠశాల కమిషనర్‌ దేవసేనతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలన్నారు. పరీక్షలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. మెటీరియల్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. 


logo