న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో్ దారుణం జరిగింది. పన్నెండేండ్ల బాలుడు తన టీనేజ్ సోదరిపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక శరీరంలో మార్పులు రావడం గమనించిన తల్లి ప్రశ్నించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తనపై సోదరుడు రెండుసార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని బాలిక (16) కుటుంబ సభ్యులకు వివరించింది.
రెండు మూడు నెలల కిందట సోదరుడు తనను లైంగికంగా వేధించాడని ఈ వ్యవహారంతో ఎదురయ్యే పరిణామాలు తమ ఇద్దరికీ తెలియవని బాలిక పేర్కొంది. బాలిక పరిస్థితి గమనించిన తల్లి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తనపై లైంగిక దాడి గురించి తల్లికి చెప్పినా ఆమె వినిపించుకోలేదని పోలీసులు చెప్పారు. బాలికకు ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబసభ్యులు భావించారని ఆమె గర్భవతి అని పసిగట్టలేకపోయారని తెలిపారు.