శంకర్‌పల్లిలోనే శస్త్ర చికిత్సలు

- చేవెళ్ల వెళ్లనవసరంలేదు
- హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
శంకర్పల్లి, ఫిబ్రవరి 22: శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో కుటుంబ నియంత్ర శస్త్ర చికిత్సలు మళ్లీ ప్రారంభించినందుకు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుం చి దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభ మయ్యాయి. డిప్యూటీ డీహెచ్ఎంవో డాక్టర్ దామోదర్ పర్య వేక్షణలో 83 మంది మహిళలకు శస్త్రచికిత్సలు చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రారంభించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా శంకర్పల్లి దవాఖానలో కు.ని. శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. దీంతో మహిళలు చేవెళ్ల దవాఖానకు వెళ్లే వారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత శంకర్పల్లి ప్రభుత్వ దవా ఖానలో రోగులకు మెరుగైన చికిత్సలు అందుతున్నాయి. ప్రతీ రోజు దవాఖానాకు ఓపీ పేషంట్లు సుమారు 200 వరకు వస్తున్నారు. ప్రతీ బుధవారం గర్భిణిలకు పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే చిన్న పిల్లలకు టీకాలు వేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో దవాఖానలో 11,483 మంది రోగులు చికి త్స పొందారు. 36 మంది మహిళలకు కాన్పులు జరిగాయి. మండలంలోని టంగటూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ దవా ఖానలో గడిచిన మూడు నెలల్లో 4,866 మంది రోగులకు చికిత్సలు అందించారు. ప్రసవించిన వారికి కేసీఆర్ కిట్లు, ప్రభు త్వం అందించే పారితోషాకాన్ని అందిస్తున్నారు. శంకర్పల్లి దవాఖానలో ఇద్దరు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. టంగటూరు దవాఖానలో ఒక డాక్టర్ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఈ రెండు దవాఖానలలో ప్రతీ రోజు కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చాలా సంతోషం..
దవాఖానలో మళ్లీ కుటుంబ ని యంత్రణ శస్త్ర చికిత్సలు ప్రారం భించడం సంతోషం.ఎనిమిది సం వత్సరాలుగా దవాఖానలో శస్త్ర చికిత్సలు నిలిపివేశారు.దీంతో ఆప రేషన్ చేయించుకోవాలనుకున్న మహిళలు ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి చేవెళ్ల దవాఖానకు వెళ్లే వారు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు.
- మంజుల, గృహిణి
తాజావార్తలు
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు
- కోట్లు పలికిన పదిసెకన్ల వీడియో
- ‘ఓటీఎస్’ గడువు పెంచిన ప్రభుత్వం
- ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులు అరెస్టు