శుక్రవారం 05 మార్చి 2021
Rangareddy - Jan 27, 2021 , 00:10:44

రాముని సేవలో మేము సైతం..

రాముని సేవలో మేము సైతం..

  • టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి విరాళాలు సేకరించిన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
  • తనవంతుగా రూ.లక్ష అందజేత
  • ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు

ఆమనగల్లు, జనవరి 26 : అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం నిర్మాణంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమనగల్లులో ఆర్‌ఎస్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో రామమందిరం నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే రూ.లక్ష,  టీఆర్‌ఎస్‌ మాడ్గుల మండల నాయకుడు సూదిని నారాయణరెడ్డి రూ.51వేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు తోటగిరి యాదవ్‌ 21వేలు, మండల అర్జున్‌రావు 21వేలు, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి 11వేలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ 11వేలు, శ్రీనివాస్‌రెడ్డి 10వేలు, శ్రీరామాంజనేయ స్వామి సేవాసమితి నిర్వాహకుడు నిరంజన్‌ రూ.10వేలతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు తమకు తోచినంత విరాళాలు అందజేశారు. 

VIDEOS

logo