గురువారం 04 మార్చి 2021
Rangareddy - Jan 27, 2021 , 00:10:44

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

  • చేవెళ్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

న్యూస్‌నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ, జనవరి 26: చేవెళ్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాలో 72వ గణత్రంత వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ ఆవిష్కరించారు. మున్సిపల్‌ కార్యాలయం, గాంధీనగర్‌కాలనీలో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. తాసిల్దార్‌ కార్యాలయంలో తాసి ల్దార్‌ పాండు, మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌ అహ్మద్‌, ఆర్డీవో కా ర్యాలయంలో ఆర్డీవో రాజేశ్వరి  జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, భీష్వ కిష్టయ్య పాల్గొని వందనం సమర్పించారు. కేశంపేట మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్‌, చౌదరిగూడ మండల కేం ద్రంలో ఎంపీపీ యాదమ్మ, కొత్తూరు మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, నందిగామ మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఎంపీపీ ప్రియాంకగౌడ్‌ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలో ఆయా గ్రామాల్లో ఆయా సర్పంచ్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌, శంకర్‌పల్లి మండలా ల్ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీడీవోలు అనురాధ, హరీశ్‌కుమార్‌, సత్తయ్య, విజయలక్ష్మి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గోవర్దన్‌రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, మున్సిపల్‌ కమిషనర్‌ జైత్రాం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు పొన్న స్వప్నారెడ్డి, మద్దెల శివనీల, వైస్‌ చైర్మన్‌ డప్పు రాజు  పాల్గొన్నారు. 


VIDEOS

logo