మంగళవారం 02 మార్చి 2021
Rangareddy - Jan 26, 2021 , 04:42:16

ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి

ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి

కందుకూరు. జనవరి 25 : ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం సమావేశం హాలులో 29 మంది లబ్ధిదారులకు   కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ   ఆడపిల్లలు తల్లి దండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి  పథకాన్ని ప్రారంభించారన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేదలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నట్లు వివరించారు. పేదలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్‌ నిలుస్తున్నట్లు తెలిపారు. పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ప్రభు త్వం చేసిన అభివృద్ధిని చూసి తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడి ప్రతి పక్ష నాయకులు  ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.  ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మీసురేందర్‌రెడ్డి,తహసీల్దార్‌ జ్యోతి, వైస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ గోపీరెడ్డి విజేందర్‌రెడ్డి, నాయకులు వట్నాల ఈశ్వర్‌గౌడ్‌, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మన్నే జయేందర్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సురుససాని రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ సురుసాని శమంతకమణి,సామ మహేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo