అభివృద్ధి ఘనత టీఆర్ఎస్దే !

- ఎమ్మెల్యే కాలె యాదయ్య
- షాబాద్ మండలం కుమ్మరిగూడలో ‘శుభోదయం’
షాబాద్, జనవరి 25: రాష్ట్రంలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కు తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, మార్కెట్ చైర్మన్ పొన్న స్వప్నారెడ్డి, గ్రామ సర్పంచ్ పొనమోని కేతనతో కలిసి శుభో దయం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లానీరు అందిస్తున్నామన్నారు.కుమ్మరిగూడ గ్రామానికి రూ. 80 లక్షలతో బీటీ రోడ్డు వేయించిన్నట్లు చెప్పారు. గ్రా మంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవ నం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, మాజీ మా ర్కె ట్ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, ఉప సర్పంచ్ అనిత, ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తాసిల్దార్ కార్తీక్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మహేందర్‌గౌడ్, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, ఏపీవో వీరాసింగ్, ఏఈ లు శ్రీదివ్య, శివకుమార్, కార్యదర్శి మల్లేశ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమార్‌యాదవ్, పోచయ్య, మల్లయ్య, పాపిరెడ్డి, నర్సింహులు, రమేశ్‌యాదవ్, రవి, అంజయ్య, కృష్ణ, అవిలాశ్గౌడ్, దినేశ్, శ్రీను, యాదయ్య తదితరులున్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ...
మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధి దారులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవి నాశ్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి, సర్పంచ్ కేతనల చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
తాజావార్తలు
- బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చచ్చిపోవాలని అనిపించేది: మేఘన్
- హై ఫిల్టర్ మాస్క్‌లో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్
- కుమారుడిని పరిచయం చేసిన కరీనా
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్