ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Rangareddy - Jan 26, 2021 , 00:19:42

పలుకరిస్తూ.. ఆరా తీస్తూ..

పలుకరిస్తూ.. ఆరా తీస్తూ..

  • ప్రజలను నేరుగా కలువడం సంతోషంగా ఉంది
  • పల్లె ప్రగతితో ప్రతినెలా 
  • రూ.339 కోట్ల నిధులు విడుదల
  • కందుకూరు మండలం
  • మాదాపూర్‌లో మంత్రి పల్లెనిద్ర

పల్లెప్రగతితో గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి పల్లె అడుగులు వేస్తున్నాయని, పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలను నేరుగా కలువడం సంతోషంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఎస్సీల భూముల అభివృద్ధి పథకం కింద మాదాపూర్‌ గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. సోమవారం పల్లెనిద్రలో భాగంగా కందుకూరు మండలం మాదాపూర్‌లో పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించారు.

రంగారెడ్డి, జనవరి 25, (నమస్తే తెలంగాణ) : పల్లెనిద్ర కార్యక్రమంతో పల్లెలు ప్రగతి బాటకు అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం పల్లెనిద్రలో భాగంగా కందుకూరు మండలం మాదాపూర్‌ గ్రామంలో పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  పల్లెప్రగతితో అమలవుతున్న పథకాలను మంత్రి పరిశీలించారు. గ్రామ సమస్యలను జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో కలిసి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలని, స్వచ్ఛ మాదాపూర్‌ కోసం గ్రామస్తులంతా కృషి చేయాలన్నారు. గ్రామంలో అధికారులు అందుబాటులో ఉంటున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రైతుబంధు డబ్బులు అందాయా, పింఛన్లు వస్తున్నాయా, ఎవరు ఇస్తున్నారంటూ అడుగగా, సీఎం కేసీఆర్‌ అంటూ గ్రామస్తులు సమాధానమిచ్చారు. అర్హులైన వారందరికీ పింఛన్లను అందిస్తామని, మూడేండ్లలో ఆరు రైతు కుటుంబాలకు రైతుబీమా  అందజేశామన్నారు. పల్లెప్రగతి పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లను మంజూరు చేస్తున్నదన్నారు. సంబంధిత నిధులతో నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పల్లెప్రగతితో గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి పల్లె అడుగులు వేయాలన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతున్నదని, ప్రజలను నేరుగా కలువడం సంతోషంగా ఉందన్నారు. మాదాపూర్‌ గ్రామంలోని ఎస్సీల భూముల అభివృద్ధి పథకం కింద పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. 

VIDEOS

logo