బుధవారం 03 మార్చి 2021
Rangareddy - Jan 22, 2021 , 00:15:59

అలసత్వం వహించొద్దు

అలసత్వం వహించొద్దు

  • వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పరిశీలించిన 
  • డబ్ల్యూహెచ్‌వో బృందం

షాద్‌నగర్‌టౌన్‌, జనవరి 21: నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు షాద్‌నగర్‌ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను గురువారం డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ విద్యారెడ్డి పరిశీలించారు. వ్యాక్సిన్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్‌ను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అలసత్వం వహించొద్దని సూచించారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రామకృష్ణ ఉన్నారు. 

కేశంపేట పీహెచ్‌సీ  సందర్శన

కేశంపేట, జనవరి 21, కేశంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీని గురువారం వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ బృందం సభ్యురాలు డాక్టర్‌ విద్య పరిశీలించారు. ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్‌ తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు రోజులు ఎంత మందికి టీకాలను వేశారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.  ఆమె వెంట వైద్యాధికారి డాక్టర్‌ ఫల్గుణ్‌కుమార్‌, సూపర్‌వైజర్లు ఆంజనేయులు, శ్రీహరి, సుందరి, పుష్ప, ఫార్మాసిస్టులు పద్మ, నాగమ్మ, హేమలత, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

వికారాబాద్‌ జిల్లాలోని 28 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

వికారాబాద్‌,జనవరి 21: వికారాబాద్‌ జిల్లాలో గురువారం 28 ప్రభుత్వ దవాఖానల్లో 957 మందికి కరోనా టీకా వేశారు. మొదటి రోజు 90 మందికి, రెండో రోజు 266 మంది, మూడో రోజు 1449 మంది, నాల్గో రోజు 1927 మందికి గానూ 957 మందికి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేశారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జీవరాజ్‌ వికారాబాద్‌ పట్టణంలోని రామయ్యగూడ, మోమిన్‌పేట, పట్లూర్‌, సిద్దులూరు, బంట్వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్‌ విధానాన్ని పరిశీలించారు. అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

1279 మందికి వ్యాక్సిన్‌

రంగారెడ్డి, జనవరి 21,(నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా గురువారం 1279 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.స్వరాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 47 దవాఖానల్లో 2379 మందికి వ్యాక్సిన్‌ చేయాల్సి ఉండగా, 54 శాతం మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు ఆమె వెల్లడించారు. మిగతా 1100 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు 3884 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. 

- స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో  రంగారెడ్డి


VIDEOS

logo