సోమవారం 08 మార్చి 2021
Rangareddy - Jan 20, 2021 , 00:26:56

మురిపిస్తున్న ముద్దాయిపేట

మురిపిస్తున్న ముద్దాయిపేట

  • జోరుగా పల్లె ప్రగతి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు
  • సమస్యల పరిష్కారానికి చర్యలు

యాలాల, జనవరి 19 : అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గ్రామాల సరసన యాలాల మండలం ముద్దాయిపేట కూడా నిలుస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా పూర్తిస్థాయిలో ఇక్కడ అమలవుతుంది. గ్రామంలో ఇండ్లు 333 ఉండగా జనాభా 1565 ఉంది. నిరక్షరాస్యతను పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా అడుగులు వేస్తూ నేటికీ అక్షరాస్యతలో 52.3 శాతాన్ని అందుకుంది.  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముద్దాయిపేటలో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. దోమల పెరుగుదలకు కారణమవుతున్న మురుగుకాలువలను శుభ్రం చేస్తున్నారు. అనవసరమైన చెట్లను తొలగిస్తున్నారు. తాగునీటి సమస్యల పరిష్కారంలో భాగంగా పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్తవి బిగిస్తున్నారు. ప్రకృతి వనం ఏర్పాటుతో గ్రామంలో ఆహ్లాదకరణ వాతావరణం ఏర్పడుతున్నది. కొత్త శోభ సంతరించుకున్నది. వనంలో నీడనిచ్చే మొక్కలతో పాటు ఆయుర్వేద, పూల మొక్కలు నాటుతున్నారు. వాకింగ్‌ ట్రాక్‌చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు  రచించడమే కాకుండా వాటి అమలులో ప్రత్యేకతను చాటుకుంటున్నారు సర్పంచ్‌ కృష్ణయ్యగౌడ్‌. కొత్త పంచాయతీలకు నిధులు కేటాయిస్తుండడంతో గ్రామం అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. గ్రామంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న రైతు వేదిక ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 


VIDEOS

logo