మంగళవారం 09 మార్చి 2021
Rangareddy - Jan 18, 2021 , 04:27:09

వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

బడంగ్‌పేట : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆర్‌ఎన్‌రెడ్డి నగర్‌లో గీతాంజలి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ సిద్దాల బీరప్ప ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌ దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని వారికి  ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉప యోపడుతాయన్నారు.  ఉచిత కంటి పరీక్షలు చేయించిన గీతాంజలి లయన్స్‌ క్లబ్‌ సభ్యులను ఆమె అభినందించారు.

వేంకటేశ్వర ఆలయంలో పూజలు

జిల్లెలగూడలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ప్ర త్యేక పూజలు చేశారు. ఆలయ సమస్యలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తాన న్నారు.  కార్యక్రమంలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు సిద్దాల లావణ్య బీరప్ప, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అర్కల కామేశ్‌రెడ్డి, కార్పొరేటర్‌ అర్కల భూపాల్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

మంత్రికి కృతజ్ఞతలు 

 మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నందిహిల్స్‌ కాలనీ  అభివృద్ధి కోసం రూ.50 లక్షలు కేటాయించినందుకు  నందిహిల్స్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి  సబితా ఇంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బీటీ రోడ్డుకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించారని పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ , డిప్యూటీ మేయర్‌ సహకారం మరువలేనిదన్నారు. 

 సమస్యలను పరిష్కరించాలి

మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 165 లో ప్రభుత్వం అందజేసిన ఇండ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని జిల్లెలగూడ అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు  మంత్రి  సబితా ఇంద్రారెడ్డిని  కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో పేదలకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో కార్పొరేటర్‌ గజ్జల రాంచందర్‌, పోరెడ్డి పద్మ భాస్కర్‌రెడ్డి, అంజయ్య, గొట్టె భిక్షపతి, బాల్‌రాజ్‌, శ్రీశైలం, బాబు తదితరులు ఉన్నారు.

VIDEOS

logo