శనివారం 06 మార్చి 2021
Rangareddy - Jan 18, 2021 , 00:12:23

ఘనంగా మల్లన్న బోనాలు

ఘనంగా మల్లన్న బోనాలు

కొత్తూరు రూరల్‌, జనవరి 17: కొత్తూరు మండలపరిధిలోని తీగా పూర్‌ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్‌ రమాదేవి, దాతలు మైసగల్ల రమేశ్‌, మెండె కృష్ణయ్యయాదవ్‌, హరినాథ్‌రెడ్డి ఆధ్వ ర్యంలో మల్లన్న, ఎల్లమ్మ బోనాలు  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న, ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మహిళలు, యువతులు డప్పు దరువు లు, శివసత్తుల ఆట, పాటల మధ్య బోనాలను ఊరేగింపుగా తీసు కువచ్చి మల్లన్న, ఎల్లమ్మకు బియ్యం, నైవేద్యాన్ని సమర్పిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రమాదేవి, నాయకులు రమేశ్‌, కృష్ణయ్య మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కల్యాణ ఉత్సవాన్ని చేయకుండా కేవలం బోనాలను నిర్వహించినట్లు తెలిపారు. అనం తరం  మెండె కృష్ణయ్య యాదవ్‌, హరినాథ్‌ రెడ్డి ఆధ్వ ర్యంలో గ్రామస్తులకు అన్నదానం చేశారు. 

కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌ నర్సింహ, సింగిల్‌విండో డైరెక్టర్‌ సాయిలు, నాయకులు జొల్లు బాలయ్య, యాదగిరియాదవ్‌, రవి యాదవ్‌, కె.పరమేశ్వర్‌, సుధాకర్‌, జొల్లు కుమార్‌, జంగయ్య, ఎం.రవి, మల్లేశ్‌యాదవ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo