సోమవారం 08 మార్చి 2021
Rangareddy - Jan 18, 2021 , 00:12:21

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి 

అబ్ధుల్లాపూర్‌మెట్‌, జనవరి17: మైనింగ్‌ జోన్‌లో భూములు కోల్పోతున్న బండరావిరాల, చిన్న రావిరాల గ్రామాల భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి హామీనిచ్చారు. ఆదివారం మైనింగ్‌ జోన్‌ భూ నిర్వాసితులు ఎమ్మెల్యేను కలిసి తమకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం  మైనింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసి  రైతులను మోసం చేసిందన్నారు. సుమారు 209 మంది బడుగు, బలహీన వర్గాల  రైతులు మైనింగ్‌ జోన్‌పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మైనింగ్‌ జోన్‌లో భూములు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.  విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరిస్తానన్నారు. ఎమ్యెల్యేను కలిసిన వారిలో బండ రావిరాల సర్పంచ్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ దంతూరి అనిత మహేందర్‌  గౌడ్‌, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కొత్త కిషన్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ కొలను శేఖర్‌ రెడ్డి, నాయకులు ఎన్‌.స్వామి, కొత్త ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo