సోమవారం 08 మార్చి 2021
Rangareddy - Jan 17, 2021 , 00:19:30

జోరుగా రోడ్డు విస్తరణ పనులు

జోరుగా రోడ్డు విస్తరణ పనులు

  • హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, స్థానికులు 

షాద్‌నగర్‌టౌన్‌, జనవరి 16 : గత ప్రభుత్వాల హయాంలో గుంతలమయంగా ఉన్న రోడ్లు తెలంగాణ సర్కార్‌ ఏర్పడ్డాక అద్దంలా మారుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు వేస్తుండడంతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారింది. దీనికితోడు   షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని చటాన్‌పల్లి రైల్వే గేట్‌ నుంచి షాద్‌నగర్‌ దూసకల్‌ బైపాస్‌ వరకు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ చొరవతో నిధులు మంజురు కావడంతో మున్సిపల్‌ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు రూ.కోటి నిధులు మంజురయ్యాయి. అనునిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో రోడ్లు గుంతలమయంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అంతేకాకుండా ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరిగేవి. రోడ్డు విస్తరణ పనులతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు 

బాలాజీ ఉదయ్‌, వాహనదారుడు, షాద్‌నగర్‌

చటాన్‌పల్లి రైల్వేగేట్‌ నుంచి రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా పూర్తవుతుండడం సంతోషంగా ఉంది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయం ఉండేది. ఎమ్మెల్యే చొరవతో రోడ్డు పనులు త్వరితంగా అవుతున్నాయి. 

చాలా సంతోషంగా ఉంది 

ఫయాజ్‌, వాహనదారుడు, దూసకల్‌, షాద్‌నగర్‌

గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణించి ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు. రోడ్డు విస్తరణ పనులతో ప్రమాదాలు తగ్గుతాయి. గుంతలమయంగా ఉన్న రోడ్డు పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉంది. 

VIDEOS

logo