సోమవారం 08 మార్చి 2021
Rangareddy - Jan 17, 2021 , 00:19:28

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

కొందుర్గు, జనవరి 16 : గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో పేర్కొన్న నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి నర్సింహులు అన్నారు. శనివారం గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన సర్పంచ్‌ శ్రీధర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామానికి ఇచ్చిన నిధులతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా అమలైన నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు ఆయన వివరించారు. గ్రామాలను పచ్చదనంగా ఉంచేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి మొక్కలను సరఫరా చేస్తున్నదని.. వాటిని పూర్తిస్థాయిలో రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. 

VIDEOS

logo