రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డుకు విద్యార్థుల ఎంపిక

రంగారెడ్డి, జనవరి15 : కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డుకు జిల్లా నుంచి 15మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరానికి గాను పాఠశాల స్థాయిలో ఎంపికైన మొత్తం 156 ప్రాజెక్టుల నుంచి ఉత్తమమైన 15ప్రాజెక్టులను న్యాయనిర్ణేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. ఈపోటీలను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేశారన్నారు. ఎంపికైన విద్యార్థులు బి.అక్ష (జడ్పీహెచ్ఎస్ చిన్న మంగళారం), కె. అరవింద్ ( జడ్పీహెచ్ఎస్ కొత్తూరు), కె. సైదులు (జడ్పీహెచ్ఎస్ మాడ్గుల), డి.పవన్‌కుమార్ (జడ్పీహెచ్ఎస్ చింతుల్ల), టీ. అన్విత(మహత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్సియల్ స్కూల్ ఇబ్రహీంపట్నం), ఎం. మౌనిక (జడ్పీహెచ్ఎస్ ఆరుట్ల), ఏ. గణేష్ (జడ్పీహెచ్ఎస్ లింగంపల్లి), ఈ. పవన్‌కుమార్ (జడ్పీహెచ్ఎస్ తొర్రూరు), పి. శ్రీనివాస్‌రెడ్డి(జడ్పీహెచ్ఎస్ ఖానాపూర్), కె. సుశీల (నాగార్జున హై స్కూల్ రాయదుర్గం), కె.లహరి (జడ్పీహెచ్ఎస్ తొర్రూరు), ఎస్. మానస బాల (సిద్ధార్థ హైస్కూల్ బడంగ్పేట్), వై. నందిని (జడ్పీహెచ్ఎస్ దేవుని ఎర్రవల్లి), బి. భాను ప్రసాద్ (భాష్యం హైస్కూల్ ఆర్.కే పురం), జి. మైత్రి (జడ్పీహెచ్ఎస్ కేశంపేట).
తాజావార్తలు
- నవీన్, ప్రియదర్శిని ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- దిగొస్తున్న బంగారం.. మున్ముందు కింది చూపులేనా?!
- మమతా దీదీ.. రాయల్ బెంగాల్ పులి: నెత్తికెత్తుకున్న శివసేన
- కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు
- గోల్కొండ కోటకు కొత్త సోయగం.. సౌండ్ అండ్ లైట్ షో
- రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్
- ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు..
- బెంగాల్ పోరు : నందిగ్రాం బరిలో దీదీపై సువేందు అధికారి పోటీ!