సంబురంగా స్వాగతం

- నేటి వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
- వ్యాక్సిన్ బాక్స్‌లకు పూజలు చేసిన సిబ్బంది, స్థానికులు
- రంగారెడ్డిలోని 9 కేంద్రాల్లో 270 మందికి, వికారాబాద్ జిల్లాలో 3 కేంద్రాల్లో 90 మందికి వ్యాక్సిన్ పంపిణీ
- రంగారెడ్డిలో 26,080, వికారాబాద్‌లో 5,331 మంది వైద్య సిబ్బంది
- ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యాక్సినేషన్
- మొదట ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు పంపిణీ
- సోమవారం నుంచి అన్ని కేంద్రాల్లో టీకాల ప్రక్రియ
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఉమ్మడి రంగారెడ్డి వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రంగారెడ్డి జిల్లాలో కొండాపూర్, వనస్థలిపురం, నార్సింగి, హఫీజ్‌పేట్, మైలార్‌దేవ్‌పల్లి, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్‌నగర్ దవాఖానల్లో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు జిల్లా దవాఖాన, వికారాబాద్ ఏరియా, పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున వ్యాక్సిన్ ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఫ్రంట్‌లైన్ వారియర్స్ 26,080 మంది ఉండగా.. వారిలో 270 మందికి, వికారాబాద్ జిల్లాలో మొత్తం 5,332 మంది ఉండగా.. వారిలో 90 మందికి నేడు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మిగతా వారికి 18 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తారు. వ్యాక్సినేషన్‌కు ఒక్కొక్కరికి 40 నిమిషాల సమయం తీసుకోనున్నది. మొదటి డోస్ తీసుకున్న 28 రోజులకు రెండో డోస్ అందిస్తారు. సోమవారం నుంచి ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
- జిల్లాలో 9 కేంద్రాల్లో ఏర్పాట్లు
- నేడు 270 మందికి కొవిడ్ టీకా
- శుక్రవారం మధ్యాహ్నానికి చేరుకున్న వ్యాక్సిన్
- అత్యవసర సేవలకు అంబులెన్స్‌ల ఏర్పాటు
రంగారెడ్డి, జనవరి 15, (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి ప్రారంభంకానున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో నేడు అన్ని ప్రభుత్వ దవాఖానల్లోనే వ్యాక్సిన్ వేయనున్నారు. జిల్లాలోని అన్ని కేంద్రాలకు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కొవిడ్ వ్యాక్సిన్‌ను తరలించారు. కొవిడ్ తో పోరాడటంలో ముందు వరుసలో ఉన్న ఆరోగ్య సిబ్బందికే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం తమ పేర్లను నమోదు చేసుకున్న వారి ఫోన్లకు సందేశాన్ని అధికారులు చేరవేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనంతరం అత్యవసర చికిత్స కోసం ప్రతి కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్‌కు ఒక్కొక్కరికీ 40 నిమిషాల సమయం తీసుకోనున్నది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ అందించనున్నారు.
కేంద్రాల వారీగా ..
కొవిడ్ వ్యాక్సినేషన్‌కు 9 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురం ఏరియా దవాఖానలతో పాటు నార్సింగి, హఫీజ్‌పేట్, మైలార్‌దేవ్‌పల్లి, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేడు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున తొలిరోజు 270 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరోవైపు ఒక్కొక్కరికీ వ్యాక్సినేషన్, పర్యవేక్షణ కోసం 40 నిమిషాల సమయం పట్టనున్నుది. వెరిఫికేషన్ గదిలో వ్యాక్సిన్‌కు వెళ్లిన వారు ఆన్లైన్ వివరాలను నమోదు చేసుకున్నారో లేదో కంప్యూటర్ ఆపరేటర్ పరిశీలించి పేరు నమోదు చేసుకున్నట్లయితే వారిని మాత్రమే వ్యాక్సినేషన్ గదికి పంపించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య బృందం పరీక్షించి బాగుందని నిర్దారణకు వచ్చిన అనంతరం టీకా వేసి అనంతరం పర్యవేక్షణ గదిలోకి పంపనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని అరగంటపాటు వైద్య బృందం పర్యవేక్షించనున్నది. నిర్దేశిత పర్యవేక్షణ సమయంలో సదరు వ్యక్తిలో ఎలాంటి మార్పులు లేనట్లయితే వారిని ఇంటికి పంపిస్తారు. టీకా తీసుకున్న వ్యక్తిలో ఏదైనా మార్పులు గుర్తిస్తే వెంటనే చికిత్స నిమిత్తం తరలించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.
18 నుంచి జిల్లా అంతటా..
ఈనెల 18 నుంచి జిల్లాలోని ప్రతి పంపిణీ కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. అదేవిధంగా వారానికి నాలుగు రోజులు టీకా వేయనున్నారు. సోమవారం నుంచి రోజుకు ఒక్కో పంపిణీ కేంద్రంలో 100 మందికి కరోనా టీకాను అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 59 ప్రభుత్వ దవాఖానలుండగా, నేడు 9 దవాఖానల్లో టీకా పంపిణీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి మిగతా 50 దవాఖానల్లో రోజుకు 5వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరోవైపు జిల్లాలో మొత్తం ఫ్రంట్‌లైన్ వారియర్స్ 26,080 మంది ఉండగా, వీరిలో 270 మందికి నేడు, మిగతా వారికి 18 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. అయితే జిల్లాలో 1650 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది 6081 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బంది 2889 మంది. మిగతా వారు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులున్నారు. అదేవిధంగా ప్రైవేట్ దవాఖానలు, మెడికల్ కాలేజీలు 803 ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న సిబ్బంది 19,999 మంది ఉన్నారు. నేడు నార్సింగి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంత్రి సబితారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నేడు రంగారెడ్డి జిల్లాలోని 9 ప్రభుత్వ దవాఖానల్లో 270 మందికి టీకా వేయనున్నాం. సోమవారం నుంచి మిగతా అన్ని పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తాం. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల వద్ద అత్యవసరానికిగాను అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశాం.
- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
తాజావార్తలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
- బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
- పల్లా, వాణీదేవి లకు తొర్రూరు బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్‌లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు