రుణాల జాతర

- స్వయం ఉపాధి కోసం ఎస్సీకార్పొరేషన్ ద్వారా రుణాలు
- నేటి నుంచి మున్సిపాలిటిల్లో దరఖాస్తులస్వీకరణ
ఇబ్రహీంపట్నం, జనవరి 13 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతుల స్వయం ఉపాధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలను అందజేయడానికి శ్రీకారం చుట్టింది. వివిధ వృత్తుల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేని వారిని గుర్తించి వారందరికీ రుణాలను అందజేసి ఆర్థికం గా నిలదొక్కుకునేందుకు గానూ ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలను అందజేయడానికి ముందుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.1.50లక్షల దాయం ఉన్నవారికి, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం ఉన్న వారిని గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయా వృత్తుల్లో ఆసక్తి ఉన్నవారికి రుణాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మండల పరిషత్‌ల ఆధ్వర్యంలో, ము న్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక వృత్తుల్లో ప్రావీణ్యం ఉన్న ఎంతోమంది ఎస్సీలు స్వతహాగా యూనిట్లను ప్రారంభించుకునేందుకు ఆర్థిక సాయం లేక కూలీ పని చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి రుణాలు ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇరవై లక్షల లోపు వ్యయంతో కూడిన సుమారు 36 యూనిట్లను ప్రభుత్వం గుర్తించింది. ఆయా యూనిట్లలో ప్రావీణ్యం ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవోకు, పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్లకు ధరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 21 దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికార యం త్రాంగం ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. చిన్న యూనిట్లకు వంద శాతం ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, పది లక్షలకు పైన ఉన్న యూనిట్లకు సబ్సీడీతో పాటు కొంత భారాన్ని బ్యాంకులు భరించే విధంగా రుణ సౌకర్యం కల్పించనున్నారు. రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పూర్తైన వెంటనే రుణాల పంపిణీ చేపట్టే అవకాశాలున్నాయి.
ప్రభుత్వం గుర్తించిన యూనిట్లు..
మినీ డెయిరీ, నాలుగు పాడి గేదెలకు రూ.4 లక్షలు, కూరగాయల పందిరి సాగుకు రూ.4 లక్షలు, ఒంటరి, వితంతు మహిళ పెరట్లో కోళ్ల పెంపకానికి రూ.80 వేలు, వెదురు వస్తువుల తయారీ పరిశ్రమకు రూ.7 లక్షలు, మినీ బ్యాండ్సెట్కు రూ.6లక్షలు, సిమెంట్ ఇటుకల తయారీకి రూ.12 లక్షలు, డిటర్జెంట్ పౌడర్, సబ్బుల తయారీకి రూ.12 లక్షలు, చేపల చెరువులకు రూ.7.60 లక్షలు, మొబైల్ టిఫిన్ సెంటర్‌కు రూ.8.20 లక్షలు, కేక్ తయారీ పరిశ్రమకు రూ.7.50 లక్షలు, పేపర్ ప్లేట్ల తయారీకి రూ.2 లక్షలు, పేపర్ గ్లాసులు, ప్లేట్ల తయారీకి రూ.9 లక్షలు, రీసైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్‌కు రూ.12 లక్షలు, టైలరింగ్, రెడీమేడ్ వస్తువుల దుకాణానికి రూ.9.80 లక్షలు, పసుపు పొడి తయారీ పరిశ్రమకు రూ.8 లక్షలు, క్లాత్ బ్యాగులు, జూట్ బ్యాగుల తయారీ పరిశ్రమకు రూ.7 లక్షలు, మినీదాల్ మిల్కు రూ. 5లక్షలు, చెప్పుల తయారీకి రూ.2లక్షలు, శానిటైజర్ల పరిశ్రమకు రూ.2 లక్షలు, అట్టపెట్టల తయారీ పరిశ్రమకు రూ.12 లక్షలు, గోనెసంచుల తయారీ పరిశ్రమకు రూ.5 లక్షలు, డయాగ్నోస్టిక్ క్లినికల్ ల్యాబ్‌కు రూ.6 లక్షలు, అల్యూమినియం పరిశ్రమకు రూ.2 లక్షలు, ఐరన్గేట్లు, గ్రిల్స్ తయారీ పరిశ్రమకు రూ.8 లక్షలు, ఫొటో, వీడియోగ్రాఫ్ స్టూడియోకు రూ.2.50 లక్షలు, లాండ్రీ, డ్రై క్లీనింగ్ దుకాణానికి రూ.5 లక్షలు, జిమ్ సామాగ్రికి రూ.5 లక్షలు, మినీ పిండి గిర్నికి రూ.2 లక్షలు, పండ్లు, జ్యూస్ తయారీకి రూ.2.50 లక్షలు కేటాయించనుంది.
ట్రాన్స్పోర్ట్ వాహనాలకు..
ట్రాక్టర్‌కు రూ.10 లక్షలు, హర్వెస్టర్ రూ.19 లక్షలు, వరి నూర్పిడి యంత్రానికి రూ.3 లక్షలు, పవర్ టిల్లర్‌కు రూ.2 లక్షలు, సరుకు రవాణా వాహనానికి రూ.12 లక్షలు, కార్ ట్యాక్సీ నాలుగు చక్రాల వాహనానికి రూ.8 లక్షలు, మూడు చక్రాల ప్యాసింజర్ ఆటోకు రూ.4 లక్షల చొప్పున కేటాయించనుంది.
ధరఖాస్తు చేసుకునే విధానం..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేసే యూనిట్లకు వెనుకబడిన తరగతులకు చెందిన ఎస్సీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌కార్డు, కులం, ఆదా యం ధ్రువీకరణ పత్రాలతో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల వారికి సంవత్సరానికి రూ.2 లక్షల ఆదాయం, గ్రామీణ ప్రాం తాల వారికి సంవత్సరానికి లక్ష యాభై వేల ఆదాయం ఉన్నవారే ఈ దరఖాస్తులకు అర్హులు. గ్రామీణులు ఎంపీడీవో లాగిన్‌లో, పట్టణ వాసులు మున్సిపల్ కమిషనర్ లాగిన్‌లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
తాజావార్తలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాల అరెస్ట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు