బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న తాప్సీ విలక్షణ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. హిందీ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత మాత్రం వరసగా కథా నేపథ్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే దాదాపు ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ షో కూడా చేస్తుంది. ప్రస్తుతం హసీనా దిల్ రుబా అనే సినిమాలో నటిస్తుండగా, ఇందులో మిర్జీపూర్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నాడు. హర్షవర్ధన్ రాణే మరో కీలక పాత్రలో నటించాడు. 2020 సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, రీసెంట్గా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో విక్రాంత్ మాస్సేతో కలిసి తాప్సీ చేసిన రొమాన్స్ సినిమాపై అంచనాలు పెంచింది. విక్రాంత్ మాస్సేని పెళ్లి చేసుకున్న తాప్సీ.. హర్షవర్ధన్ రాణేతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించారు. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ ఫిలిమ్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.