హైదరాబాద్, జూన్ 10: టాటా స్కై తమ వినియోగదారులకు అందించే అనేక ఎంటరైన్మెంట్ సర్వీస్ లల్లో మ్యూజిక్ సర్వీస్ కూడా ఒకటి. ఇంతకు ముందు టాటా స్కై టాటా స్కై మ్యూజిక్ ,టాటా స్కై మ్యూజిక్ + లను అందించేది. కానీ ఇప్పుడు టాటా స్కై మ్యూజిక్ , టాటా స్కై మ్యూజిక్ + రెండింటిలోని బెస్ట్ గా ఉన్నవాటిలో కొన్నింటిని అప్ డేట్ చేసి సరికొత్త మ్యూజిక్ సర్వీస్ ను అందిస్తున్నది.
టాటా స్కై మ్యూజిక్కు సభ్యత్వాన్ని పొందిన వినియోగదారులకు హంగామా మ్యూజిక్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. సాధారణంగా హంగామా మ్యూజిక్ ప్రో నెలకు రూ.99 ధర కు లభిస్తుంది. ఇందులో వినియోగదారులు 20 వేర్వేరు ఆడియో స్టేషన్లు, 5 వీడియో స్టేషన్ల నుంచి పాటలను వినే అవకాశం ఉన్నది. టాటా స్కై మ్యూజిక్ సర్వీసును కొనుగోలు చేసిన వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లతో పాటు టీవీల్లో కూడా యాక్సెస్ చేసుకోడానికి వీలు ఉంటుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ, గజల్, భక్తి, హిందుస్తానీ వంటి మరెన్నో రకాల సంగీతం ఇందులో అందుబాటులో ఉంది. టాటా స్కై నుంచి ఇది సూపర్ ఆఫర్ ఎందుకంటే ఇది రోజుకు రూ.2.5 కుమాత్రమే లభిస్తుంది.