రైతు బాంధవుడు కేసీఆర్

పరిగి/కులకచర్ల/పూడూరు/దోమ: సర్కారు అన్ని విధా లుగా అందిస్తున్న అండతో రైతులలో భరోసా పెరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతులకు అనేక విధాలుగా సాయం చేయడంలో సీఎం కేసీ ఆర్ ముందున్నారని, సర్కారు అందిస్తున్న చేయూతతో తె లంగాణలోని రైతులలో భరోసా పెరిగిందన్నారు. మంగళ వారం పరిగి మండలం నస్కల్, పూడూరు, దోమ మండల కేంద్రాలలో రైతు వేదికలను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభిం చారు. అదేవిధంగా పరిగి మండలం నజీరాబాద్ తండాకు రూ.90 లక్షలతో నిర్మాణం చేపట్టిన రోడ్డును, కులకచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఆవరణలో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి , రూ.2. 05కోట్లతో సమగ్ర శిక్ష నిధులతో నిర్మించే అదనపు గదులు, ల్యాబ్ నిర్మాణానికి, దోమ మండలం రాకొండ నుంచి బ్రా హ్మణపల్లి రోడ్డును కలుపుతూ రూ.2.50 కోట్లతో చేపట్టే బీ టీ రోడ్డు పనులకు, దోమ జూనియర్ కళాశాల అదనపు గదు ల ప్రారంభానికి, రూ.45 లక్షలతో గ్రంథాలయ భవన ని ర్మాణానికి శంకుస్థాపన చేశారు, రైతుల సౌకర్యార్థం గోదాం నిర్మాణానికి భూమిపూజ చేశారు. పూడూరు మండల కేం ద్రంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి సబితారెడ్డి మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయం, సమయాను కూ లంగా విత్తనాలు, ఎరువులు, సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేస్తున్నదని తెలిపారు. రైతులు ఏ కారణంగా మృతి చెందినా రైతుబీమా కింద రూ.5లక్షలు సాయం అందు తు ందని తెలిపారు. రైతుబంధు కింద యాసంగి పంటలకు రూ.7,300కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న దని మంత్రి వెల్లడించారు. వీలైనంత త్వరగా పాలమూర్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు సర్కారు చిత్తశుద్దితో పనిచేస్తుందని, త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు సర్కారు తీసుకుం టుందని, తద్వారా రాబోయే కాలంలో పరిగి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని మంత్రి సబితారెడ్డి చెప్పారు.
చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహే శ్రెడ్డిలు మాట్లాడుతూ మూడు పూటల అన్నం పెట్టే రైతుల కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోపా ల్, ఎంపీపీలు అరవింద్ రావు, అనుసూజ, మల్లేశం, సత్య మ్మ, జడ్పీటీసీలు హరిప్రియ, మేఘమాల, రాందాస్ నాయ క్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అజారుద్దీన్, పీఏసీఎస్ చైర్మన్లు కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్లు మేడిద రాజేందర్, లక్ష్మ య్య, రాజేందర్‌రెడ్డి, పీరంపల్లి రాజు, దోమ, పూడూరు వైస్ ఎంపీపీలు మల్లేశం, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీని వాస్‌రెడ్డి, రాజగోపాలచారి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమా ర్‌రెడ్డి, సురేందర్‌కుమార్, గోపాల్, సర్పంచ్‌లు మేడిద పద్మ మ్మ, రాజిరెడ్డి, సౌమ్యారెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి