శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Rangareddy - Dec 08, 2020 , 05:58:22

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

  • ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి కృషి
  • చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి 
  • పరిగిలో ‘స్మైల్‌ఏ గిఫ్ట్‌' అంబులెన్స్‌ ప్రారంభం

 పరిగి: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని స్మైల్‌ ఏ గిఫ్ట్‌ కార్యక్రమంలో భాగంగా ఎంపీ తన స్వంత డబ్బులతో తాండూరు నియోజకవర్గానికి ఇచ్చిన అంబులెన్స్‌ను సోమవారం పరిగిలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ ఒక్క పిలుపుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు దాతల సహకారంతో అంబులెన్స్‌లు అందాయని అన్నారు. పేదల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేయడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు. అంబులెన్స్‌ సేవలతో అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తాండూరు పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌, నాయకులు రఘునందన్‌, వెంకటాచారి, పరిగి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆంజనేయులు,  నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎదిరె క్రిష్ణ, వారాల రవీంద్ర, బద్రుద్దీన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo