శనివారం 23 జనవరి 2021
Rangareddy - Dec 05, 2020 , 06:54:16

బహిరంగ మల మూత్ర విసర్జన.. నియంత్రణే ధ్యేయంగా..

బహిరంగ మల మూత్ర విసర్జన.. నియంత్రణే ధ్యేయంగా..

పెద్దఅంబర్‌ పేట : బహిరంగ మల మూత్ర విసర్జన నియంత్రనే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం మున్సిపాల్టీలో పూర్తి స్తాయిలో పూర్తవుతుంది. ప్రతి వేయి మందికి ఒక టాయిలెట్‌ ఉండాలనే సంకల్పం మున్సిపాల్టీలో పూర్తయింది. మున్సిపాల్టీలో మొత్తం 28 టాయిలెట్ల నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు ఉండగా ఇప్పటికే 12 ఉన్నాయి. వాటికి తోడు మరో 16 సిద్ధ్దం చేశారు. ఒక్కో యూనిట్‌కు సుమారు 75 వేల రూపాయల వ్యయంతో నిర్మాణం చేశారు.  మున్సిపాల్టీలో ఇప్పటికే  తట్టిఅన్నారం, పెద్దఅంబర్‌పేటలో 12 ఉండగా ...ఇప్పుడు పెద్దఅంబర్‌పేటలోని కొహెడ రోడ్డులో నాలుగు, పసుమాముల దారిలో 4, జాతీయ రహదారిపై 4, కుంట్లూర్‌, పసుమాముల  వార్డు కార్యాలయాల పరిసరాల్లో 2 చొప్పునా పూర్తి చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా వీటిని సిద్ధం చేసి, మరుగుదొడ్డి అనే ఫీలింగ్‌ కలుగకుండా అందమైన చిత్రాలను వేయించారు.  గతంలో తట్టిఅన్నారం, సూర్యవంశీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న వాటిని కూడా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన టాయిలెట్లను జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించి  మున్సిపాల్టీ అధికారులను అభినందించారు.


logo