సంక్షేమమే సర్కార్ ధ్యేయం

- అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే యోచన
- ఫార్మాసిటీలో స్థానిక యువతకు ఉపాధి
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- కప్పాడులో అసైన్డ్ భూముల అభివృద్ధి అవగాహన సదస్సు
ఇబ్రహీంపట్నంరూరల్ : ఎన్నో ఏండ్లుగా అసైన్డ్ భూములను నమ్ముకుని బతుకున్న రైతులకు పట్టాలు అందజేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు గ్రామంలో నిర్వహించిన అసైన్డ్ భూముల అభివృద్ధి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అసైన్డ్ భూముల అభివృద్ధి కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లాలోని కప్పాడు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు ప్రత్యేకంగా న్యాయం చేయాలనే సంకల్పంతో గతంలో ఎస్సీలకు అందజేస్తున్న భూములను అభివృద్ధి చేసేందుకు సీం కేసీఆర్ సంకల్పించారని అన్నారు. ఎన్నో ఏండ్ల క్రితం అందజేసిన ఈ భూములు అభివృద్ధి లేక పంటల సాగుకు నోచుకోలేదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ భూములకు విద్యుత్ సరఫరా, బోరుబావులు తవ్వించడం, గుంతలు, మెర్రలు ఉన్న భూములను చదును చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సంకల్పించినట్టు తెలిపారు. భూము లు అభివృద్ధి చేసిన తరువాత కూడా పంటల సాగుకోసం ప్రభు త్వం అనేక రకాల సబ్సీడీలు అందజేసి ఎస్సీ రైతులకు అండగా నిలిచేందుకు కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరో వారం రోజుల్లో ప్రారంభించి మార్చి నాటికి వందశాతం పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నందున రైతు లు కూడా వారి వెంట ఉండి కావల్సిన పనులు చేయించుకుని వారికి సహకరించాలని కోరారు. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కు రైతులు ఎంతో రుణపడి ఉం టారని ఆయన గుర్తుచేశారు. 104 సర్వేనెంబర్లో గల 90ఎకరాల అసైన్డ్ భూమిని మొదటగా అభివృద్ధి చేసిన తరువాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతుందని తెలిపారు. రైతులు తొందరపాటుకు పోయి భూ ములు అమ్ముకుని మోసపోవద్దని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ కింద తీసుకున్న ఈ నిర్ణయానికి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎక్కడికి విద్యుత్ సరఫరా కావాలన్నా, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా అందించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్సీ కమిషన్ రాష్ట్ర జీఎం ఆనంద్ మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వం ఎస్సీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ కింద సబ్సీడీ రుణా లు అందజేసి కార్లు, ఆటో లు పంపిణీ చేస్తుందని, అలాగే, ఎస్సీ కార్పోరేషన్ కింద రైతులకు మినిడైరీలతో పాటు వ్యవసా య రంగానికి సహకరిస్తుందని తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫార్మాసిటీ తెలంగాణాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫార్మాసిటీలో ఈ ప్రాంత నిరుద్యోగయువతీ యువకులకు ఉపాది అవకాశాలు దొరుకుతాయని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు ఐదువేల నుంచి పదివేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం ఖాయమన్నారు. అలాగే, ఎలిమినేడులో త్వరలో ఐటీరంగ సంస్థలు రానున్నాయని తెలిపారు. మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ గ్రా మంలో గల 400 ఎకరాల్లో ప్రభుత్వ రంగసంస్థలను తీసుకువచ్చి వెనుకబడిన మంచాల మండాలన్ని అభివృద్ధి చేస్తామన్నా రు. గ్రామ సర్పంచ్ సామల హంసమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ ఛైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఉప్పరిగూడ బూడిద రాంరెడ్డి, ఉపసర్పంచ్ మునీర్, సహకార సంఘం డైరెక్టర్ బాల్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీడైరెక్టర్ ఏనుగుబుచ్చిరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ విజయనాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి డే రంగుల నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు భరత్‌కుమార్, మం కాల దాసు, మంద సురేష్, నిట్టు జగదీశ్వర్, కత్తుల కుమార్, సామల శ్రీనివాస్‌రెడ్డితో పాటు వార్డుసభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్‌కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి
- నిద్రలేని రాత్రులు గడిపా
- పూర్వ క్రీడాకారుల సమ్మేళనం
- టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం
- బాలీవుడ్లో వివక్ష ఎక్కువే..