గురువారం 28 జనవరి 2021
Rangareddy - Dec 03, 2020 , 07:48:31

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

ఆమనగల్లు: కల్వకుర్తి నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెం దిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయన నివాసంలో బుధవారం సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు అందజేశారు. రాంపూ ర్‌ గ్రామానికి చెందిన బాధితులు పర్శ రాములుకు రూ.25వేలు, శివకు రూ.24 వేలు, పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన లింగమయ్యకు రూ.60 వేలు, వెల్దండకు చెందిన పుల్లయ్యకు రూ.30 వేలు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా మంజురయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారంతా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ్మ, కృష్ణ, రవీందర్‌, చందు, రమేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు.


logo