వైభవంగా మైసిగండి మైసమ్మ జాతర

కడ్తాల్ : జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి. ఉత్సవాలలో భాగంగా సోమవారం తొలిరోజు ఆలయ ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి క్షీరాభిషేకం, కుంభహారతి అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయా న్ని కొబ్బరి, మామిడాకుల తోరణాలు, వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో అలంకంరించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ శిరోలీ, తాసిల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ వ్యవస్థాపకులు చాట్ల వెంకటేశ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు శేఖర్‌గౌడ్, పాండునాయక్, శ్రీరాములుగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, గణేశ్‌గౌడ్, పూల శంకర్, హర్యానాయక్, లక్ష్మణ్‌నాయక్, అమృనాయక్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.