చివరి రోజు మరింత జోరు..

గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆదివారం హోరెత్తింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు నగరానికి వెళ్లి ఆయా డివిజన్ల పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజారంజక పాలనను అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకాలని ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. అలర్లు సృష్టించాలని చూస్తున్న మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేయాలన్నారు.
కొందుర్గు : హైదరాబాద్ పట్టణంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆదివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కాచిగూడ అభ్యర్థి శిరీషయాదవ్ను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి తాలుగ కన్వీనర్ ముస్త్తఫా, జిల్లెడు చౌదరిగూడ సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, నాయకులు రమేశ్, నర్సింహులు, విక్రంరెడ్డి పాల్గొన్నారు.
గ్రేటర్ ప్రచారంలో మండల నాయకులు
మొయినాబాద్ : గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మొయినాబాద్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు విజయనగర్ కాలనీ డివిజన్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో మండలం నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు ప్రచారానికి తరలివెళ్లారు. ఆదివారం విజయనగర్ కాలనీలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రంజయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, ఎంపీటీసీలు బట్టు మల్లేష్, రవీందర్, రితీష్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, ఎంఏ రావూ ప్, బాల్‌రాజ్ తదితరులు ప్రచారం చేశా రు. టీఆర్ఎస్ మహి ళా విభాగం జిల్లా అధ్యక్షుడు జే స్వప్నసతీష్కుమార్కు హఫీజ్‌పేట డివజన్‌లో ప్రచా రం నిర్వహించారు. లంగర్‌హౌజ్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి తరపున టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోం పల్లి అనంతరెడ్డి ప్రచారం చేశారు.
అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
కొత్తూరు రూరల్: గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కొత్తూరు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాచిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బద్దుల శిరీషకు మద్దతుగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మండలనాయకులు ఆయా కాలనీల్లో ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు
గ్రేటర్ల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం
శంకర్పల్లి రూరల్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌండ్ల రవీందర్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తాయన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇతర పార్టీల నాయకులు మాటలు నమ్మకూడదన్నారు. బీజేపీ పార్టీ నాయకులు ప్రజల్లో మత చిచ్చును పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని, వారి మాటలను నమ్మకూడదన్నారు.
గ్రేటర్లో టీఆర్ఎస్ వైపే ఓటర్లు
షాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్న స్వప్న అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఆరేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తాయన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారు నమ్మె స్థితిలో లేరని స్పష్టం చేశారు. గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్
- ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
- చివరి రోజు.. 73 మందికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
- లక్షద్వీప్‌లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులు
- అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి