జ్యోతిరావుఫూలే గొప్ప సామాజిక వేత్త

మొయినాబాద్ : జ్యోతిరావు ఫూలే గొప్ప సామాజిక వేత్త అని ఆయన ఆశయసాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐఏవైఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు అన్నారు. జ్యోతిరావు పూల 130 వర్థంతిని మొయినాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నివాళ్లు అర్పించారు. పురుషులతో సమానంగా ఆడపిల్లలకు కూడ అక్షర జ్ఞానం ఉండాలనే ఆలోచనతో మొదటి సారిగా సావిత్రీబాయి పూలేను చదివించారని చెప్పారు. కార్యక్రమంలో ఏఐఏవైఎస్ మైనార్టీ విభాగం జిల్లా నాయకులు అన్వర్‌ఖాన్, ఏఐఏవైఎస్ గుర్రాల భాస్కర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రెగొల్ల యాదగిరియాదవ్, రజక సంఘం మండల అధ్యక్షుడు వినోద్‌కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు కుమార్, బేగరి రాజు, ఎం సునీల్‌కుమార్, బి వినోద్‌కుమార్, గౌతంరెడ్డి, బి మహేందర్, అమ్జాత్, నర్సిములు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావుఫూలే వర్ధంతి
కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రంలో జ్యోతిరావు ఫూలే 130వ వర్ధంతిని స్వేరోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా నాయకులు దుర్గని శ్రీను, రాజు, ప్రభాకర్, సాల్మన్‌రాజ్ పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
కొత్తూరు రూరల్: జ్యోతిరావు ఫూలే 130వ వర్థంతి సందర్భంగా కొత్తూరు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ బాతుక దేవేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంటనొళ్ల యాదగిరి హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కృష్ణయ్య, నాయకులు రాఘవేందర్‌యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ సాయిలు, నాయకులు దర్శన్, రవినాయక్, శ్రావణ్‌కుమార్, మక్బుల్, ఇస్మాయిల్, మహ్మద్ పాల్గొన్నారు.
షాబాద్ : జ్యోతిరావు ఫూలే ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగరగూడ, తాళ్లపల్లి గ్రామాల సర్పంచ్‌లు ఈదుల కృష్ణాగౌడ్, సమ్మి పెంటయ్య అన్నారు. మహాత్మ జ్యోతిరావుపూలే వర్ధంతిని ఆయా గ్రామాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో నాగని రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ పాండు, బాస నర్సింహులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..
- ప్రధాని చెప్పారు.. ఈటల పాటించారు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ