రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చిరుజల్లులు

- కమ్ముకున్న మబ్బులు
- చల్లటి ఈదురు గాలులతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- ఇండ్లకే పరిమితమైన జనాలు
నివర్ తుఫాన్‌తో చలి ముసురుకుంది. చలి తీవ్రతతో జనం గజగజా వణుకుతున్నారు. గురువారం నుంచి వాతారణం పొడిగా ఏర్పడింది. గురువారం సాయంత్రం నుంచి చినుకులు పడటం ప్రారంభమైంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లడానికి కొంత ఇబ్బంది పడ్డారు. సూర్యుడిని చూద్దామన్నా జాడ కనిపించలేదు. రోజంతా మబ్బులు కమ్ముకున్నాయి. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నారులతో పాటు పెద్దలు కూడ చలితో వణికిపోయారు. బయటకు వెళ్లేవారు స్వెటర్ వేసుకుని వెళ్లారు.
పెద్దేముల్ : నివర్ తుఫాన్ ప్రభావంతో మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున చిరుజల్లులతో కూ డిన వర్షం కురిసింది. ముఖ్యంగా మండల పరిధిలోని గాజీపూర్, బుద్దారం, గోపాల్పూర్, నాగులపల్లి, ఇందూరు, మారేపల్లి, జనగాం, మం బాపూర్తోపాటు ఇతర గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున నుంచి చిరుజల్లులు కురిశాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశమంతటా పూర్తిగా మేఘావృతమై నల్లగా మారింది. తెల్లవారుజామున నుంచి కురిసిన చిరుజల్లులకు చలి తీవ్రత పూర్తిగా పెరిగి జనాలు వణికిపోయారు. ఒకవైపు తుఫాను ప్రభావం, మరోవైపు తీవ్రమైన చలితో కూడిన వాతావరణంతో పసిపిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పనులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ముసురు వర్షం ...
వికారాబాద్ : నివార్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా నివర్ తుఫాన్‌తో ఆంధ్రా, తమిళనాడు రాష్ర్టాలలో భారీ వర్షాలు కురవగా గురు, శుక్రవారం మన ప్రాంతాల్లో సైతం చలిగాలులతో కూడిన ముసురు వర్షం కురుస్తోంది. నివార్ తుఫాన్ ప్రభా వం కారణంగా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు, రైతులను హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీల్ రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట కోతలు పెట్టుకోవద్దని, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించవద్దని ఇది వరకే సూచించారు. కాగా ఈ తుఫాన్ ప్రభావం మరో రెండురోజుల పాటు ఉండనుందని తెలిపారు.
తాజావార్తలు
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి
- బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ