ప్రతిపక్షాల్లో ఓటమి భయం

వినాయక్‌నగర్: ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయని, వారి మాటాలను నమ్మవద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. వెంకటాపురం డివిజన్లో టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన టీబీ భాస్కర్, మరికొందరూ టీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన మంత్రి కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ.. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల అభివృద్ధి, సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
ఆసరా పించన్లతో పాటు ఆడ పిల్లల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వా రా ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అల్వాల్ సర్కిల్ ప్రజల దాహర్తిని తీర్చడానికి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. డిసెంబర్ నుంచి నీటి బిల్లులు మాఫీ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నామని, ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతుందని అన్నారు. అభివృద్ధిపనులు చూసి ప్రజలు ఓటువేయాలని సూ చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కో రారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ అభ్యర్థి సబితాకిశోర్, డివిజన్ అధ్యక్షుడు అనిల్‌కిశోర్, ఈఎస్ లక్ష్మణ్, రమేశ్, సయ్యద్ మోసిన్, రఘునాథ్, శివ, పుదారి రాజేశ్‌గౌడ్, ప్రభాకర్, జామ మహేందర్, జీ. రాజేశ్‌గౌడ్, లక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.
తాజావార్తలు
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్