బుధవారం 20 జనవరి 2021
Rangareddy - Nov 27, 2020 , 04:22:07

నేటి నుంచి మిషన్‌ భగీరథ నీటి సరఫరా: సబితాఇంద్రారెడ్డి

నేటి నుంచి మిషన్‌ భగీరథ నీటి సరఫరా: సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో నేటి నుంచి మిషన్‌ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎల్లూరు వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో నెల రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. అయినా ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రెండు జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నీటి సరఫరాకు ఆదేశించామన్నారు. దీంతో అధికారులు ఒకవైపు మరమ్మతులు  చేస్తూనే, మరోవైపు ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు.  సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో శుక్రవారం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా నీటి సరఫరాకు కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు. 


logo