శనివారం 16 జనవరి 2021
Rangareddy - Nov 25, 2020 , 03:57:58

మేనిఫెస్టోతో సబ్బండ వర్గాలకు న్యాయం

మేనిఫెస్టోతో సబ్బండ వర్గాలకు న్యాయం

ఆమనగల్లు: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తునా ప్రశంసల జల్లు కురుస్తుందని, తెలంగాణ రాష్ర్టానికి మణిహారం లాంటి హైదరాబాద్‌ ప్రజలకు గుండెకు తాకిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.   ఆయన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజా సంక్షేమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికలో ప్రతిపక్షాలకు పరాభవం తప్పదన్నారు.

 ప్రభుత్వంపై అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని పేర్కొన్నారు. కొంతమందికి అభివృద్ధిపై అవగాహన లేకుండా, శాంతిభ్రదతలక విఘాతం కలిగించే విధంగా రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మోత్యానాయక్‌, రాములు, రఘురాములు, వెంకట్‌రామిరెడ్డి, రమేశ్‌, సురేందర్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తయ్య, విజయ్‌ పాల్గొన్నారు.