అభివృద్ధిని చూసి ఓటేయండి

బండ్లగూడ: అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కోరారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి కోరని శ్రీలతతో కలిసి ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని శివరాంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, వాంబే కాలనీ, ఎర్రబోడ, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. ఆ అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకూ సముచిత న్యాయం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాజేంద్రనగర్ డివిజన్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ టీఆర్ఎస్కి ఓటు వేసి శ్రీలతను భారీ మెజార్టీతో గెలుపించాలని పిలుపునిచ్చారు. డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, సయ్యద్ ముజమిల్ అహ్మద్, దయానంద్, పలుగుచెరువు మహేష్, రవీందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.