అర్హులందరికీ డబుల్ ఇండ్లు: ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్ : అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బె డ్రూం ఇండ్లు మంజూరు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి చె రుకు సంగీతకు మద్దతుగా ఆదివారం డివిజన్ పరిధిలోని వాంబేకాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారందరికీ ఒకేసారి ఇవ్వడం కష్టమైనప్పటికీ దరఖాస్తుదారులందరికీ దశలవారీగా ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి డ బుల్ బెడ్రూం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మార్చిలోపు మొదటగా నాలుగు వేల మందికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.
ఇందులో ఎల్బీనగర్ ప్రాంతంలో 300, నగరంలోని ఇతర ప్రాంతాల్లో కట్టిన ఇండ్ల నుంచి 3700మంది ఎల్బీనగర్ ప్రజలకు ఇండ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. రెండో దఫాలో కట్టించే డబుల్ బెడ్రూంలలో ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ప్రజలకు మరో 6 వేల మందికి ఇండ్లు కేటాయించే ప్రక్రియ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. అలాగే, వాంబేకాలనీ ప్రజల కోరిక మేర కు కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ ను నిర్మించి ఇస్తామని సుధీర్‌రెడ్డి తెలిపారు. వాంబేకాలనీతో పాటు ఇతర కాలనీలకు చెందిన అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, పోచబోయిన గణేశ్‌యాదవ్, కత్తుల రాంబాబు, దూగుంట్ల నరేశ్, ప్రమీల, అరుణ, జెట్టి అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సంగీత ఇంటింటి ప్రచారం..
నాగోల్ డివిజన్ పరిధి శ్రీఇంద్రప్రస్థకాలనీ, ఆదిత్యనగర్, ఫతుల్లాగూడ, శ్రీనివాసకాలనీల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు సంగీత ప్రచారాన్ని హోరెత్తించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె ఇంటింటా తిరిగారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్‌యాదవ్, నాయకులు సుర్వి రాజుగౌడ్, డప్పు వెంకటేశ్, పంగ శ్యామ్, గోల్కొండ మైసయ్య, సుధాకర్ చారి, చెరుకు జంగయ్య గౌడ్, అంజమ్మ, ఉమాదేవి, గౌరి, కందికంటి రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
- ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం