మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 23, 2020 , 05:14:42

ట్యాంకుల నిర్మాణం వేగవంతం

ట్యాంకుల నిర్మాణం వేగవంతం

షాద్‌నగర్‌టౌన్‌: ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్‌ మిషన్‌భగీరథ పథకానికి  శ్రీకారం చుట్టింది. ఓ వైపు  సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరో వైపు ప్రజా ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది తెలంగాణ సర్కార్‌. ఇందులో భాగంగానే కృష్ణాజలాలను శుద్ధి చేస్తూ ప్రతి ఇంటికి ఆరోగ్యకరమైన మంచినీటి అం దించే విధంగా తెలంగాణ సర్కార్‌ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే చాలా వరకు మిషన్‌ భగీరథ పనులు పూర్తయి ప్రజలు శుద్ధి చేసిన నీళ్లు తాగుతున్నారు. మినరల్‌ వాటర్‌ కన్నా మిషన్‌ భగీరథ నీళ్లు ఎంతో నాణ్యతగా ఉంటాయి. కోట్లాది రూపాయలతో మిషన్‌భగీరథ ట్యాంకులను శరవేగంగా నిర్మిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్‌ పెద్దపీట వేయ డం పట్ల షాద్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి ఇంటికి నాణ్యమైన నీరును అందించే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన మిషన్‌భగీరథ ట్యాంకుల నిర్మాణ పనులు షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో శరవేగంతో పూర్తవుతున్నాయి. ఇప్పటికే మున్సి పాలిటీలో పలు కాలనీల్లో మిషన్‌భగరీథ నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. మున్సిపాలిటీలోని 28వార్డుల్లో ప్రతి ఇంటికి నీళ్లు అందించే విధంగా మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏడు  ట్యాంక్‌లు, 135కిలో మిటర్ల మిషన్‌భగీరథ పైపులైన్‌కు ఏర్పాటు నిర్మాణ పనులు కొనసా గుతున్నాయి. ట్యాంక్‌ నిర్మాణ పనులతో పాటు ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చే విధంగా అధికా రులు ప్రణాళికను రూపొందించారు. ఇటీవలే షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ సంప్‌ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మిషన్‌భగీరథ నీటి ట్యాంక్‌ నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులకు మిషన్‌భగీరథ పథకం ద్వారా రూ. 67కోట్ల 61లక్షలు మంజూరు అయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా మున్సిపల్‌ ప్రజలు ఎదురు చూస్తున్న మంచినీళ్లు త్వరి తంగా నల్లాల ద్వారా అందనున్నడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తునారు.

త్వరలోనే ఇంటింటికీ మిషన్‌భగీరథ నీళ్లు

త్వరలోనే మున్సిపాలిటీలోని ఇంటింటికీ మిషన్‌భగీరథ నీళ్లు అందిస్తాం. మున్సిపాలిటీలో పునఃప్రారంభించిన మిషన్‌భగీరథ ట్యాంక్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  మిషన్‌భగీరథ నీళ్లు తాగడం ద్వారా ఎలాంటి అనార్యోగ సమస్యలు ఉండవు. తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టిన మిషన్‌భగరీథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది.  -కొందూటి నరేందర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ షాద్‌నగర్‌ 

ప్రజారోగ్యంపై సర్కార్‌ శ్రద్ధ

మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి మిషన్‌భగీరథ నీళ్లను త్వరితంగా అందించే విధంగా మిషన్‌ భగరీథ ట్యాంక్‌ నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. 28 వార్డులకు గానూ ఏడు ట్యాంకులను మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ఏర్పాటు చేయనుంది. త్వరితంగా పూర్తి చేసేలా కృషి చేస్తున్న మెగా ఇంజినీరింగ్‌ సంస్థకు కృతజ్ఞతలు. ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుటుంది.  -ఎంఎస్‌ నటరాజ్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షాద్‌నగర్‌