శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Nov 23, 2020 , 05:09:59

ఔటర్‌ చుట్టూ ‘ట్రామా’ కేంద్రాలు

ఔటర్‌ చుట్టూ ‘ట్రామా’ కేంద్రాలు

 ఆదిబట్ల: ఔటర్‌ రింగు రోడ్డు అంటేనే అమిత వేగం... ప్రతి రోజు ఎక్కడో ఒక చోటా రోడ్డు ప్రమాదాలు జరగటం నిత్యకృత్యంగా మారింది. పలితంగా అనేక మంది మృత్యువాత పడటం..క్షతగాత్రులుగా మారటం మనం చుస్తూనే ఉన్నాం. ఈనేపథ్యంలో  ఔటర్‌ రింగు రోడ్డుపై ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించటానికి ప్రభుత్వం ఇటీవల ‘ట్రామా’ కేంద్రాలను ఏర్పాటు చే సింది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ట్రామా కేంద్రాలు ఎందరికో సత్యర వైద్యాన్ని అందించి ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. 157 కిలోమీటర్ల చుట్టూ విస్తరించి ఔటర్‌ రింగు రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజా ఎగ్జిట్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం, ఎచ్‌ఎండీఏ, అపోలో దవాఖానాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ట్రామా కేంద్రాలు క్షతగాత్రులకు చక్కని వైద్యాన్ని అందిస్తూ.. ప్రాణాలను కాపాడుతున్నా యి. ఔటర్‌ రింగు రోడ్డుపై ప్రమాదాలు జరిగి, గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందక ఎంతోమంది ప్రా ణాలు గాలిలో కలసిపోతున్నాయి. 

దీంతో ఔటర్‌పై జరిగే ప్ర మాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి, వారి ప్రాణాలు కాపాడేందకు ప్రభుత్వం అన్ని వసతులతో ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ చు ట్టూరా శంషాబాద్‌, అప్పా జంక్షన్‌, కోకాపేట్‌, పటాన్‌చెరువు, దుండిగల్‌, శామీర్‌పేట్‌, ఘట్‌కేసర్‌, పెద్దఅంబర్‌పేట్‌, బొంగుల్లూర్‌, తుక్కగూడ టోల్‌ప్రాజా ఎగ్జిట్‌ల వద్ద ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి ట్రామా అత్యవసర కేంద్రాల్లో క్షతగాత్రులకు వైద్య సేవలు అందించటానికి అవసరమైన సిబ్బంది ప్రతి నిత్యం అందుబాటులో ఉంటున్నా రు. ట్రామా కేంద్రాల్లో రెండు బెడ్లను ఏర్పాటు చేసి, వైద్యా న్ని అందించటానికి అన్ని వసతలు కల్పించారు. ప్రమాదా ల్లో గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకోవటానికి విడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిపుణులైనా డాక్టర్లు అందుబాటులోకి వచ్చి, సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. గా యడిన వారి పరిస్థితి విషమంగా ఉంటే వారిని వెంటనే  అంబులెన్స్‌ ద్వారా సమీపంలోని కార్పొరేట్‌ దవాఖానలకు తరలించి, వారి ప్రాణపాయం నుంచి కాపడాడుతున్నారు.

అందుబాటులో అంబులెన్స్‌లు..

 ఔటర్‌ రింగు రోడ్డుపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ట్రామా కేంద్రాలకు తీసుకు వచ్చేందుకు అంబులెన్స్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓఆర్‌ఆర్‌పై రోడ్లు ప్రమాదాల్లో గాయపడినవారు 1066 ఎమర్జెన్సీ నంబర్‌ కు ఫోన్‌ చేస్తే 10 నుంచి 15 నిమిషాల్లో అంబులెన్స్‌ ప్రమాద స్థలానికి చేరకుంటుంది. ఔటర్‌పై  ప్రతి పది కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం, అంబులెన్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్షతగాత్రులకు అంబులెన్స్‌లో ప్రాథమిక వైద్య సేవ లు సైతం అందించటానికి కావాల్సిన వసతులు కల్పించారు 

ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ లక్ష్యం..

ప్రాణం వెలకట్ట లేనిది. ప్రజల ప్రాణాలను కాపాడటం గొప్ప విషయం. ఔటర్‌ రింగు రోడ్డుపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలను కాపాడి, వారికి ఆ యువు పోసేందుకు ప్రభుత్వం ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనిద్వారా క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. ఓఆర్‌ఆర్‌పై జరిగే ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. గాయపడిన వారికి సకాలంలో వై ద్యం అంతుంది. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయటం అభినందనీయం. ప్రమాదాల్లో గాయ పడడిన వారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసర సేవలు ఉచితంగా ప్రభు త్వం అందిస్తుంది.- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి