బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Nov 23, 2020 , 05:04:51

ధరణి పోర్టల్‌ సేవలకు అన్నదాతలు ఫిదా

ధరణి పోర్టల్‌ సేవలకు  అన్నదాతలు ఫిదా

ధరణి పోర్టల్‌ సేవలకు జనం జేజేలు పలుకుతున్నారు. సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా లంచాలు, అవతవకలకు అడ్డుకట్ట పడింది. మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేస్తుండడంతో దూరభారం, చార్జీల ఖర్చు తప్పిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంత సులువు అనుకోలేదు...భూమి రిజిస్ట్రేషన్‌ ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు. గతంలో రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ నెలలబడి తిరగలేక తీవ్ర అవస్థలు పడేవాళ్లం. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో తాసిల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతున్నది. కడ్తాల్‌ మండలంలోని సాలార్‌పూర్‌ గ్రామంలో 25 గుంటల భూమి కొనుగోలు చేశాను. స్లాట్‌ బుక్‌ తర్వాత తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా కేవలం 20 నిమిషాల్లోపే రిజిస్ట్రేషన్‌ అయిపోయింది. ధరణి పోర్టల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు.

ధరణి పోర్టల్‌ ద్వారా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో రిజ్రిస్ట్రేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణితో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఏ పని మొదలుపెట్టిన అది ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, కేసీఆర్‌ సార్‌కు అన్నదాతలు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని పేర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌తో మధ్యవర్తుల బెడద, లంచాలు ఇచ్చే పరిస్థితి తప్పిందని, సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు.

రైతులకు ఎంతో మేలు... 

ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో  భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ధరణి పోర్టల్‌ వచ్చిన తరువాత మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న మరుసటి రోజు కేవలం 30 నిమిషాలలో రిజిస్ట్రేషన్‌ పూర్తి కావడం సంతోషించదగ్గ విషయం. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. హరీశ్‌రావు. మోమిన్‌కలాన్‌, ధారూరు

రూపాయి ఖర్చులేకుండా రిజిస్ట్రేషన్‌...

ధరని పోర్టల్‌తో రూపాయి ఖర్చులేకుండా భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చును. గతంలో రెవెన్యూశాఖలో పనులు జరగాలంటే చేతులు తడపాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి సేవలు అందుబాటులోకి రావడంతో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి జరగకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుల కష్టాలు తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో ఉండడంతో అదృష్టంగా భావిస్తున్నాం. నర్సింహారెడ్డి, రైతు మోమిన్‌ఖుర్ధు, ధారూరు

 రైతులకు వరం ... 

ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌లు త్వరగా పూర్తి అవుతుండడంతో సమయం వృధా కావడం లేదు. భూమిని కొనుగోలు చేసిన రైతుతో ఒప్పందం పూర్తియి న తర్వాత నేరుగా తాసిల్దార్‌ ఆఫీసుకు వెళ్లిన వెంటనే అధికారులు రికార్డులను పరిశీలించిన వెంటనే రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేసి ప్రొసిడింగ్‌  పత్రాలను  కొనుగోలు దారులకు అందిస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ కొత్త గా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ చాలా బాగుంది.  - నౌసు హరిప్రసాద్‌, అస్మత్‌పూర్‌, మంచాల

అన్నదాతల సంక్షేమానికి కృషి

ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్లు అరగంటలోపే పూర్తవుతుండంతో రైతుల సంతోషానికి అవదుల్లేవు. ఇంత మంచి విధానంతో రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరు రుణపడి ఉంటారు. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఒకేచోట పూర్తవుతాయని ఎవరు కూడా అనుకోలేదు. లంచాలకు తావులేకపోవడంతో రైతుల్లో సంతోషం రెట్టింపవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ రుణపడి ఉంటారు. మంఖాల దాసు, ఇబ్రహీంపట్నంరూరల్‌

రైతుల్లో సంతోషం  

తెలంగాణ ప్రభుత్వం నూతన విధానంతో తీసుకువచ్చిన సులభతర రిజిస్ట్రేషన్‌ విధానం ఊహించని పరిణామం. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు మనకు ముఖ్యమంత్రి కావడం ఎంతో అదృషం. రానున్న రోజుల్లో రైతాంగ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిన్ని పథకాలు తీసుకురావడం ఖాయం. - సాయికుమార్‌ , ఇబ్రహీంపట్నంరూరల్‌

కొత్త శకానికి నాంది

ఆస్తుల రిజిస్ట్రేషన్‌ పక్రియకు ప్రభుత్వం తీసుకొచ్చి న ధరణి పోర్టల్‌ రెవెన్యూ విధానంలో కొత్త శకానికి నాంది. భూములు, ఆస్తులను పూర్తి పారదర్శకతతో ప్రజలు సులభంగా ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. కొత్త రెవెన్యూ విధానంతో ప్రజలు తమ ఆస్తులను ఒకేచోట రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్రప్రభుత్వం రైతులకు తాసిల్దార్‌ కార్యాలయంలోనే కల్పించింది. - మస్కు రమేశ్‌, యాచారం

ధరణితో రైతులకు నిమిషాల్లో హక్కు పత్రాలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి సేవలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌తోపాటు హక్కు పత్రాలు రైతుల చేతికందుతున్నాయి. దీంతో రైతులు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ పట్ల ఎనలేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నారు.  గ్రామాల నుంచి విదేశాలలో ఉండే ప్రజలు ధరణిలో తమ భూములను చూసుకుంటూ మురిసిపోతున్నారు. ధరణితో గతంలా కాకుండా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. - మహ్మద్‌ గౌస్‌, యాచారం

సులువుగా రిజిస్ట్రేషన్లు...

ధరణి పోర్టల్‌ వల్ల రైతుల భూములకు సంబంధించి సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి డివిజన్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం సొంత మండలాల్లోనే సులువుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించడం రైతుల అదృష్టం. దీనివలన రైతులకు ప్రయాణ చార్జీలతో పాటు, డబ్బులు వృధా కాకుండా ఉంటుంది. ధరణి పోర్టల్‌ తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి రైతు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.కె.వేణు, రైతు పీరంపల్లి, కులకచర్ల

ధరణి పోర్టల్‌ రైతులకు వరంలా మారింది...

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దరణి పోర్టల్‌ రైతులకు వరంలా మారింది. ఈ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములకు మరింత భద్రత ఏర్పడింది. దరణి పోర్టల్‌ ద్వారా నేరుగా స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలోనే రైతుల భూములను రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కలిపించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరుతున్నది. క్రయ విక్రయాలు చేసేవారు ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇంత సులువుగా రిజిస్ట్రేన్ల్‌ జరుగుతుంటేఅందరికి దైర్యం వస్తుంది.- కర్నె శివప్రసాద్‌,ఊరెళ్ల, చేవెళ్ల

రిజిస్ట్రేషన్‌ విధానం బాగుంది...

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పొర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ వధానం చాలా బాగుంది.ఈ పథ కం ద్వారా గ్రామాలల్లోని రైతులు చాలా సంతో షం వ్యక్తం చేస్తున్నారు.కేసీఆర్‌ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ కనుక రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కావడం మానకు ఎంతో అదృష్టం. అనవరసపు  ఖర్చులు లేకుండా ఇంత సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. బాబోయే రోజులో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకరావడం ఖాయం.- శేరి శివరెడ్డి, మల్కాపూర్‌, చేవెళ్ల

రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి

రైతుల ప్రయోజనాలను కాపాడేది తెలంగాణ ప్రభుత్వం ఒకటే. అందుకు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి, రైతులకు ఇబ్బందులు కలుగకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు ఈజీగా అవుతున్నాయి. అరగంటలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతుండడంతో రైతులో సంతోషానికి అంతులేదు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకేచోట పూర్తవుతాయని ఎవరు కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరు రుణపడి ఉంటారు.- బక్కరెడ్డి రవీందర్‌ రెడ్డి, మాల్కాపూర్‌, చేవెళ్ల

ధరణి పోర్టల్‌ చాలా బాగుంది... 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ధరణి పోర్టల్‌ చాలా బాగుంది. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం మహేశ్వరంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లేవాళ్లం. ప్రభుత్వం తాసిల్దార్‌ కార్యాలయంలోనే వ్యవసాయ భూములను రిజిస్ట్రార్‌ చేస్తుండటం తో సమయం మిగలడంతోపాటు ఖర్చులు తప్పాయి. దళారుల ప్రమేయం లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. భూముల రిజిస్ట్రేషన్‌ కోసం రైతులకు ఇబ్బందులు కలగాకుండా ఇంత మంచి విధానాన్ని తీసుకవచ్చిన సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు. -గంప శ్రీను, కడ్తాల్‌ గ్రామం

రైతులకు ఎంతో మేలు

ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దరణి పోర్టల్‌ ద్వారా మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు సులువుగానే జరుగుతున్నాయి. దరణి పోర్టల్‌తో తాసిల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయిన 20నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కావడంతో పాటు సులువుగా క్షణాల్లోనే ప్రింటెడ్‌ పాసు పుస్తకాలను ఇవ్వడం చాలా అనందంగా ఉంది. దీంతో రైతులకు ఎన్నో ఇబ్బందులు ఒక్క సారిగా తీరిపోయాయి పెండింగ్‌ పనులకు ధరణి ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. - జంగయ్య, రైతు, చేవెళ్ల