గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 22, 2020 , 06:27:27

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేతలు

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేతలు

ఆర్కేపురం : గ్రేటర్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుకోగలమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు దుబ్బాక శేఖర్‌, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొస్గి శంకర్‌, తెలుగు యువత బీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్‌గౌడ్‌ తమ మద్దతుదారులతో కలిసి శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, బల్దియా పీటం టీఆర్‌ఎస్‌కే కట్టబెడుతారని అన్నారు. గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని మంత్రి సబితాఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.