గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 22, 2020 , 04:46:20

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ఆర్కేపురం, నవంబర్‌ 21: సరూర్‌నగర్‌ డివిజన్‌ మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన సరూర్‌నగర్‌ డివిజన్‌ అభ్యర్థి పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డితో కలిసి చెరుకుతోట కాలనీ, పోచమ్మబాగ్‌ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిత్యం ప్రజాసేవకు పరితపిస్తున్న పారుపల్లి అనితారెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, నగర ప్రజలు జీహెచ్‌ఎంసీ పీఠాన్ని మరోసారి సీఎంకు కానుకగా ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని చెప్పారు. 

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూ చించారు. డివిజన్‌ అభ్యర్థి పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు అభివృద్ధికి అండగా ఉండాలని కోరారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు సైతం దక్కకుండా చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో రానున్నరోజుల్లో మురికి వాడలు లేని నగరంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరాభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించిందని గుర్తు చేశారు. అవినీతి రహిత పాలన అందిస్తూ, పట్టుదలతో పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన స మయం ఇదేనన్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే  డివిజన్‌లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌, యూత్‌వింగ్‌ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌ ముదిరాజ్‌, రాఘవేంద్ర గుప్త, శేఖర్‌రెడ్డి, కేశవరెడ్డి, సిరిపురం రాజేశ్‌గౌడ్‌, లోడి నర్సింహాగౌడ్‌, ఇస్మాయిల్‌, అభిలాశ్‌ తదితరులు పాల్గొన్నారు.