శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Nov 21, 2020 , 04:08:58

అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవ్వాలి

 అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవ్వాలి

ఆదిబట్ల : ఆదిబట్లను మినీ పట్టణంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూర్‌ సమీపంలోని మెట్రోసిటీ కాలనీలో టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ పైళ్ల కృష్ణారెడ్డి రూ. 4లక్షల సొంత డబ్బులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌, సీసీ కెమెరాలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నగరానికి అతి చేరువలో ఉన్న ఆదిబట్లను అన్ని రంగల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ సంస్థలకు ఐటీ కారిడార్‌కు అనుగుణంగా ఈప్రాంతంలోని గ్రామాలు, కాలనీల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిబట్లను మినీ పట్టణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంంతో ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. 

ప్రజలు, దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. మున్సిపాలిటీలోని గ్రామాలు, కాలనీల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, వాటిని  వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే మున్సిపాలిటీ అభివృద్ధి విషయాలు, సమస్యలు తెలుసుకోవటానికి పర్యటిస్తానని తెలిపా రు. కార్యక్రమంలో  కమిషనర్‌ సరస్వతి, సీఐ నరేందర్‌,  డీఈ అనిషా, కౌన్సిలర్లు కుంట్ల మౌనిక, కొప్పు కృష్ణరాజు, కోఆప్షన్‌ సభ్యురాలు పల్లె రేణుక, మాజీ ఎంపీటీసీ జంగ య్య,  పైళ్ల తిరుమల్‌రెడ్డి, పైళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కోరే జంగయ్య, నారని సుధాకర్‌గౌడ్‌, మెట్రోసిటీ కాలనీ అధ్యక్షురాలు ఉదయశ్రీ, నాయులు ఉదయపాల్‌రెడ్డి, మరియమ్మ, గోపినాయక్‌, ఎరుకల ప్రసాద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

ఇబ్రహీంపట్నంరూరల్‌ : పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి దోహదపడుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్‌ గ్రామానికి చెందిన దొడ్డి కృష్ణకాంత్‌కు రూ.2లక్షల సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రమణారెడ్డి, గ్రామ సర్పంచ్‌ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, టీఆర్‌ఎస్‌ నాయకులు రాములు పాల్గొన్నారు.