బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Nov 21, 2020 , 03:48:23

రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

  • రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌
  • పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి 
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
  • మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో రోడ్డు పనులు ప్రారంభం

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులను ఆమె చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. 

మొయినాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. హిమాయత్‌నగర్‌ నుంచి తంగడిపల్లి  వరకు చేపట్టిన రోడ్డు పనులు విస్తరణలో భాగంగా కొన్ని రోజులుగా హిమాయత్‌నగర్‌ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను శుక్రవారం ఎమ్మెల్యే హిమాయత్‌నగర్‌లో ప్రారంభిస్తుండగా అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న మంత్రిని చూసిన ఎమ్మెల్యే రోడ్డు పనులను ప్రారంభించడానికి ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లతోపాటు అనుబంధ రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి పథకాలను చేరవేస్తుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో పేదలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కానీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీలు సంక్షేమంపై లేని పోని రాద్దాంతం చేస్తున్నాయని, అయినా ప్రతిపక్షాల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వారు స్పష్టం చేశారు. మరోవైపు అభివృద్ధి పనులకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి నుంచి వయా హిమాయత్‌నగర్‌, గంగడిపల్లి గ్రామాల మీదుగా వికారాబాద్‌ వరకు ఉన్న అనుబంధ రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. 

గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో జరగలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే సాధ్యమని పేర్కొన్నారు. మొయినాబాద్‌ మండలం నగరానికి ఆనుకుని ఉండడంతో మంచి భవిషత్తు ఉందని తెలిపా రు. హిమాయత్‌నగర్‌ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను కూడా సీసీ ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. రోడ్డు పనులు పూర్తి అయితే వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం జయవంత్‌, జడ్పీటీసీ శ్రీకాంత్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజూల రవియాదవ్‌, వైస్‌ ఎంపీపీ మమత, ఉపసర్పంచ్‌ షాబాద్‌ శ్యాంరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ డప్పు రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్‌, ఎంపీడీవో విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మాజీ జడ్పీటీసీ కంజర్ల భాస్కర్‌, ఎంపీటీసీలు మల్లేశ్‌, రవీందర్‌రెడ్డి, రాంరెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్‌, మల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు జయవంత్‌, జిల్లా నాయకులు నర్సింహ్మారెడ్డి, రవియాదవ్‌, రాఘవేందర్‌యాదవ్‌, రాజు, యాదయ్య పాల్గొన్నారు.