మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 18, 2020 , 06:17:44

ధరణితో ధీమా..

ధరణితో ధీమా..

ఇబ్రహీంపట్నంరూరల్‌: ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. మంగళవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 100 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వెంటనే పట్టాదారు పత్రాలు, మ్యుటేషన్‌ అందజేస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఆమనగల్లు నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అరగంటలోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదంటున్నారు. జిల్లాలోఓఇబ్రహీంపట్నంలో 21, ఆమన గల్లు 27, షాద్‌నగర్‌ 29, చేవెళ్లలో 23 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.  పనులు సులభంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

వికారాబాద్‌ జిల్లాలో 73 రిజిస్ట్రేషన్లు

తాండూరు: తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ సేవల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 73 రిజిస్ట్రేషన్లు జరిగా యి.  బంటారంలో 1, బషీరాబాద్‌ 5, బొంరాస్‌పేట్‌ 3, ధారూరు 2, దోమ 3, దౌల్తాబాద్‌ 5, కొడంగల్‌ 5, కోట్‌పల్లి 3, కులకచర్ల 4, మ ర్పల్లి 3, మోమిన్‌పేట్‌ 8, నవాబుపేట్‌ 6, పరిగి 6, పూడూరు 7, తాండూరు 1, వికారాబాద్‌ 5, యాలాలలో 6 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. 

అన్నదాతల సంక్షేమానికి అవధుల్లేవు 

ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు అరగంటలో పూర్తవుతున్నాయి. ఇంత మంచి విధానం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఒకేచోట పూర్తవుతాయని ఎవరు కూడా అనుకోలేదు. - జెర్కోని రాజు, ఇబ్రహీంపట్నం

సులభతర రిజిస్ట్రేషన్లు 

కొత్త విధానంతో సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతు న్నాయి. ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. ఇంతగొప్ప నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.  - ముత్యాల భాస్కర్‌, కౌన్సిలర్‌, ఇబ్రహీంపట్నం