శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Nov 18, 2020 , 06:14:02

గేటర్‌ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలకం

గేటర్‌ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలకం

 రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: నగర శివారులో ‘గ్రేటర్‌ హైదరాబాద్‌' ఎన్నికల సందడి మొదలైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మేయర్‌తో పాటు వార్డులవారీగా రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.ఇదే సమయం లో టిక్కెట్ల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొని ఉంది. రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావాహులంతా జిల్లా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, ఆరికేపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల ఇండ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఉద్యమ పార్టీ కోసం తాము చేసిన సేవలను వివరి స్తూ తమ అభ్యర్థిత్వాలను ప్రకటించాలని వినతి పత్రాలు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ వారు త నకే టికెట్‌ వస్తోందని, బరిలో ఉన్నామని ఆశావాహులు ప్ర చారం చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధి లో ఉన్న రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం ని యోజకవర్గాలు,ఎల్బీ నగర్‌ నియోజకవర్గం పరిధిలో 25 డివిజన్లు ఉన్నాయి.ఇదిలాఉంటే  మంత్రి సబితారెడ్డి ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్ల పరిధి లో గడిచిన రెండు రోజులుగా మంత్రి సబితారెడ్డి పాదయా త్ర చేపట్టారు. ఆయా డివిజన్ల నేతలతో సమీక్షిస్తున్నారు. వచ్చేవారం రోజులు రంగారెడ్డి జిల్లా నేతలకు గ్రేటర్‌ ఎన్నికలు  కీలకం కానున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక కార్యచరణ చేపట్టి డివిజన్ల వారీగా నేతలు పర్యటించానున్నారు.అలాగే డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి ప్ర చారానికి పదును పెట్టనున్నారు. ఏడాది జనవరిలో మున్సిపల్‌, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ పది నెలల వ్యవధిలో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్‌ పరిధిలో ఉన్న 150 డివిజన్లకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని 25 డివిజన్లు కీలకం కానున్నాయి. మంత్రి సబితా రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, అరికేపూడి గాంధీ,సుధీర్‌రెడ్డిల నియోజకవర్గాల్లో ఎన్నికలు వారికి కీలకంగా మరాయి.

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిపైనే ప్రత్యేక దృష్టి

  జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోనే అత్యధికంగా డివిజన్లు  ఉన్నాయి. రాజేంద్రనగర్‌,శేరిలింగంపల్లి,మహేశ్వరం నియోజకవర్గాలు ఒకే పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. ఎల్బీ నగర్‌ నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో ఉ న్నది. ఈ నియోజకవర్గంలోనే ప్రధానంగా మూడు (రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం) నియోజకవర్గాలున్నాయి.ఈ మేరకు ప్రచారానికి వ్యూహా,ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.మంత్రి సబితారెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంతో పాటు చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని డివిజ న్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి,  నరేందర్‌రెడ్డి, ఆనంద్‌, మహేశ్వర్‌రెడ్డి, యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌,  గాంధీ, సుధీర్‌రెడ్డిలు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. 

25 డివిజన్లు ఇవే..

  మహేశ్వరం నియోజకవర్గంలో కేవలం రెండు (ఆర్కేపు రం, సరూర్‌నగర్‌) డివిజన్లు ఉండగా, రాజేంద్రగనగర్‌ అ సెంబ్లీ నియోజకవర్గంలో రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, సులేమాన్‌నగర్‌, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లు ఉండగా.. శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్‌ నియోజకర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి.గ్రేటర్‌ పరిధిలో ఉన్న 25వార్డుల్లో ఎన్నికల సం దడి నెలకొంది.రంగారెడ్డి జిల్లాలో  కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌,మియాపూర్‌, హాపీజ్‌పేట్‌, హ స్తినాపూర్‌, చంపాపేట్‌, లింగోజిగూడ, సరూర్‌నగర్‌, ఆర్కేపురం, నాగోల్‌, మన్సురాబాద్‌, హయత్‌నగర్‌, బి.ఎన్‌ రెడ్డి, వనస్థలిపురం, సులెమన్‌నగర్‌, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కొత్తపేట్‌ డివిజన్లు ఉన్నాయి.